Pushpa2 : మరో సారి వాయిదా ఫిక్స్… కన్ఫర్మ్ చేసిన బన్నీ వాసు

Pushpa2 : టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా వైడ్ గా మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న క్రేజీ పాన్ ఇండియా సినిమా “పుష్ప ది రూల్”. ఈ సినిమా పై ఇండియా వైడ్ గా ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద మినిమం వెయ్యి కోట్లు అన్న మాట ఈ సినిమాపై వస్తుంది. అంతటి క్రేజ్ రావడానికి పుష్ప ది రైజ్ సినిమా సాధించిన ఘన విజయమే కారణమని చెప్పొచ్చు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్ లో మూడేళ్ళ కింద వచ్చిన పుష్ప ఓ రేంజ్ భీభత్సం సృష్టించగా, ఇప్పుడు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 పై పదింతల అంచనాలు పెంచేసింది. అయితే ఈ సినిమా రిలీజ్ మాత్రం నెలల తరబడి వాయిదా పడుతూనే ఉంది. ఇప్పటికే మూడు సార్లు రిలీజ్ డేట్ మార్చేసిన ఈ సినిమా మరోసారి డేట్ మారేలా ఉంది.

Producer Bunny Vasu confirmed the postponement of Pushpa2

మరోసారి వాయిదా ఫిక్స్.. బన్ను వాసు కన్ఫర్మేషన్..

ఇక పుష్ప2 (Pushpatherule) సినిమాను గత ఏడాది మేకర్స్ సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేయకుండానే మళ్ళీ 2024 సమ్మర్ కి రిలీజ్ చేస్తామని అన్నారు. ఇక సమ్మర్ పోయాక ఆగస్టు 15న రిలీజ్ కంఫర్మ్ అన్నారు. తీరా డేట్ దగ్గరికొస్తున్న కొద్దీ, సడన్ గా పుష్ప2 ని డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నామంటూ మేకర్స్ చెప్పేసారు. పైగా సినిమా షూటింగ్ డిలే కావడంతోనే వాయిదా వేశామని, ఇక డిసెంబర్ కంఫర్మ్ అని మేకర్స్ చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మరో సారి పుష్ప వాయిదా ఫిక్స్ అయ్యేలా ఉంది. ఈ విషయం స్వయంగా నిర్మాత బన్నీ వాసు చెప్పుకొచ్చాడు.

- Advertisement -

తండేల్ కంఫర్మ్ చేస్తూ.. పుష్ప వాయిదాని చెప్పేసాడు.

ఇక నిర్మాత తాజాగా ఆయ్ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ, గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న తండేల్ సినిమా గురించి చెప్పుకొచ్చాడు. తాము తండేల్ (Thandel) షూటింగ్‌ని పూర్తి చేసి డిసెంబర్‌లో విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నామని, అయితే అల్లుఅర్జున్‌ ‘పుష్ప ది రూల్’ అదే నెలలో విడుదల అవుతుందని, వెయిట్ చేస్తున్నామంటూ, పుష్ప2 వాయిదా పడే ఛాన్స్ ఉందని ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది. ఇక తండేల్ CG వర్క్‌పై దృష్టి పెడుతున్నామని, దసరా తర్వాత దాని తండేల్ విడుదల తేదీని కంఫర్మ్ చేస్తామని అన్నారు. దీన్ని బట్టి దసరా వచ్చే లోపు పుష్ప2 వాయిదా కన్ఫర్మ్ చేస్తూ, కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు కాబోలు. అప్పుడు తండేల్ రిలీజ్ డేట్ ని కంఫర్మ్ చేస్తామని బన్నీ వాసు చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు