Project K: న్యూయర్ అప్డేట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటనే భారీ సినిమాలు గుర్తుకువస్తాయి. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమాల్లో మారుతి దర్శకత్వంలో వచ్చేది ఒకటి మాత్రమే చిన్న సినిమా. ఇక అన్ని కూడా భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతోనే వస్తున్నాయి. అందులో డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కే. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నారు.

అలాగే ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది. ఈ చిత్రం అనౌన్స్ చేసిన నాటి నుంచి అభిమానుల్లో అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 70 శాతం మేరకు షూటింగ్ పూర్తి అయిందని టాక్ ఉంది. కానీ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ప్రభాస్ చేతితో కూడిన పోస్టర్ ను మాత్రమే విడుదల చేశారు.

దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ నిరాశకు గురికాక తప్పలేదు. అలాగే ప్రాజెక్ట్ కే చిత్ర యూనిట్ ని అప్డేట్ ఇవ్వమని వచ్చే డిమాండ్స్ తగ్గలేదు. ఇది ఇలా ఉండగా ఈ చిత్రం గురించి ప్రస్తుతం వినిపిస్తున్న ఒక వార్త ప్రభాస్ అభిమానులకు ఊరటనిస్తుంది. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రాజెక్ట్ కే నుంచి అదిరిపోయే అప్డేట్ ఇవ్వడానికి ప్రాజెక్ట్ యూనిట్ రెడీ అవుతుందట. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ అప్డేట్ కు సంబంధించిన పనులను కూడా పూర్తి చేశారని తెలుస్తోంది. మరి అది ఎలాంటి అప్ డేట్ అనేది తెలియాలంటే జనవరి 1వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు