Mr Bacchan : తమ్ముళ్లూ.. ఇక్కడ సీట్ దొరకలేదా.. అక్కడికి వచ్చేయండి సీటు గ్యారెంటీ!

Mr Bacchan : టాలీవుడ్ లో కల్కి2898AD సినిమా తర్వాత మళ్ళీ స్టార్ హీరో సినిమా రాలేదు. ఇప్పుడు మరో రెండు వారాల్లో తెలుగులో క్రేజీ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో మాస్ మహారాజ్ రవితేజ నటించిన “మిస్టర్ బచ్చన్” సినిమా ఒకటి. రవితేజ – హరీష్ శంకర్ ల హ్యాట్రిక్ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆగష్టు 15న భారీ ఎత్తున ఈ సినిమా రిలీజ్ అవుతుండగా, చిత్ర యూనిట్ గత వారం రోజులుగా భారీగా ప్రమోషన్లు చేస్తున్నారు. ఆల్రెడీ టీజర్, సాంగ్స్ తో సినిమాపై మంచి బజ్ ని తీసుకురాగా, డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పటికే తన మార్క్ ప్రమోషన్లతో సినిమాపై కావాల్సినంత హైప్ తీసుకొచ్చాడు. ఇక లేటెస్ట్ గా హరీష్ శంకర్ ఇంటర్వ్యూలు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో తెలిసిందే. ఇదిలా ఉండగా చిత్ర యూనిట్ తాజాగా మిస్టర్ బచ్చన్ ని విన్నూతంగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

Promotions of Mr Bacchan movie in Hyderabad metro station

తమ్ముళ్లూ.. ఇక్కడ సీట్ దొరక్కపోయినా అక్కడ సీటు గ్యారెంటీ..

ఇదిలా ఉండగా తాజాగా మిస్టర్ బచ్చన్ (Mr Bacchan) చిత్ర యూనిట్ సినిమాపై ప్రమోషన్లను సరికొత్తగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో మెట్రో ట్రైన్ లో మిస్టర్ బచ్చన్ చిత్ర యూనిట్ రవితేజ మాటలతో ఆడియన్స్ జర్నీని ప్లాన్ చేశారు. రెండు రోజుల క్రితమే దీని గురించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా మెట్రో ట్రైన్ లో ఉండే అనౌన్స్ మెంట్ స్పీకర్స్ లో రవితేజ వాయిస్ తో మూవీ ప్రమోషన్లు చేసారు చిత్ర యూనిట్. మెట్రొ ట్రైన్ లో ఉండే స్పీకర్స్ లో రవితేజ మాటలు వినిపిస్తున్నాయి. అందులో రవితేజ ఇలా చెప్పుకొచ్చాడు. మెట్రో ప్రయాణికులకు స్వాగతం చెప్తూ… ఏంటి తమ్ముళ్లూ మెట్రో సీట్ దొరకలేదా? ఏం పర్లేదు.. మీ స్టేషన్ వచ్చేదాకా మిస్టర్ బచ్చన్ లో సాంగ్ హాయిగా వినుకుంటూ వెళ్లిపోండి.. మెట్రో లో మీకు సీటు దొరక్కపోయినా పర్లేదు. ఆగష్టు 15న థియేటర్లకు వచ్చేయండి అక్కడ సీటు గ్యారెంటీ అని రవితేజ వాయిస్ రికార్డింగ్ లో చెప్పుకొచ్చాడు.

- Advertisement -

ట్రైలర్ తో ఫైనల్ టచ్..

ఇక మిస్టర్ బచ్చన్ పై హైప్ బాగా పెరగగా, టీజర్, సాంగ్స్ వచ్చేసాయి. ఇక ప్రమోషన్లలో ఫైనల్ గా మిస్టర్ బచ్చన్ ట్రైలర్ రిలీజ్ కానుంది. మరో రెండు మూడు రోజుల్లో ఈ అప్డేట్ కూడా రానుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్య శ్రీ బోర్సే నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిరించడం జరిగింది. మొత్తంగా మిస్టర్ బచ్చన్ ఆగష్టు 15న పలు సినిమాల పోటీ నడుమ రిలీజ్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు