Puri – Harish : గురు శిష్యుల సినిమాలకు బిజినెస్ కష్టాలు… రీ రిలీజ్ మూవీ కంటే పరిస్థితి దారుణం..!

Puri – Harish.. ప్రముఖ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ – రామ్ పోతినేని హీరోగా డబుల్ ఇస్మార్ట్ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఇస్మార్ట్ శంకర్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో డబుల్ స్మార్ట్ అంటూ వచ్చేస్తున్నారు. ఆగస్టు 15వ తేదీన సినిమాను విడుదల చేయబోతున్న నేపథ్యంలో సినిమా నుంచి ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా ఊహించని మాస్ రెస్పాన్స్ అందుకుంది ట్రైలర్. ముఖ్యంగా సినిమా బ్లాక్ బస్టర్ అంటూ అభిమానులు కామెంట్లు చేశారు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఈ సినిమా బిజినెస్ జరగట్లేదని తెలుస్తోంది. కనీసం లోకల్ ఏరియాలలో కూడా సినిమాకు ఎక్కడ బజ్ ఏర్పడకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Puri - Harish : Guru Sishya's movies are facing business difficulties... The situation is worse than a re-release movie..!
Puri – Harish : Guru Sishya’s movies are facing business difficulties… The situation is worse than a re-release movie..!

గురు శిష్యుల సినిమాలకి బిజినెస్ కష్టాలు..

మరొకవైపు పూరీ జగన్నాథ్ శిష్యుడైన హరీష్ శంకర్ కూడా రవితేజ తో మిస్టర్ బచ్చన్ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు కూడా సినిమాపై హైప్ పెంచాయి. కానీ ఈ సినిమాని కొనడానికి బయ్యర్లు ముందుకు రాలేదు . ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఓవర్సీస్ లో సొంతంగా రిలీజ్ చేస్తున్నప్పటికీ కూడా బజ్ లేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పైగా గురువు డబుల్ ఇస్మార్ట్ కి బిజినెస్ లేకపోవడం శిష్యుడు మిస్టర్ బచ్చన్ సినిమాకి ఓవర్సీస్ లో అసలు బయ్యర్స్ దొరకకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అందుకే మిస్టర్ బచ్చన్ సినిమాని ఓవర్సీస్ లో సొంతంగా రిలీజ్ చేస్తున్నారు హరీష్.

రీ రిలీజ్ మూవీకే భారీ బజ్..

అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే. ఈవారం కృష్ణవంశీ , మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన మురారి సినిమా రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే .అయితే ఇక్కడ అందరిని ఆకట్టుకుంటున్న విషయం ఏమిటంటే రెండు కొత్త సినిమాలకు బజ్ అంతంత మాత్రమే ఉంది. కానీ రీ రిలీజ్ లో కూడా మురారి సినిమాకే ఎక్కువ కలెక్షన్లు వస్తూ ఉండడం పైగా బజ్ కూడా ఊహించని స్థాయిలో ఉండడంతో అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు బుక్ మై షో లో కూడా మురారి సినిమాకి థియేటర్స్ హౌస్ ఫుల్ అయిపోయాయి.

- Advertisement -

రీ రిలీజ్ మూవీ ముందు తేలిపోయిన స్టార్ డైరెక్టర్స్..

తాజా పరిస్థితులను బట్టి చూస్తే రీ రిలీజ్ లో కూడా సత్తా చాటుతున్న మురారి ముందు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఆయన శిష్యుడు హరీష్ శంకర్ ఇద్దరూ తేలిపోయారనే చెప్పాలి . ఈ ఇద్దరు సినిమాలకు బిజినెస్ కష్టాలు రావడం గమనార్హం. ఏది ఏమైనా మహేష్ బాబు, కృష్ణవంశీ రీ రిలీజ్ లో కూడా సత్తా చాటుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక ఇందులో సోనాలి బింద్రే హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. అసలు బిజినెస్ లేని మిస్టర్ బచ్చన్ , డబుల్ ఇస్మార్ట్ సినిమాలు ఆగస్టు 15న రిలీజ్ అయ్యి ఏ మేరకు సక్సెస్ అందుకుంటాయో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు