Puri Jagannadh: ఇస్మార్ట్ తేలిపోయినట్టే, ఇప్పుడు పూరి పరిస్థితి ఏంటి.?

Puri Jagannadh: బద్రి(Badri) సినిమాలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు పూరీ జగన్నాథ్. మొదటి సినిమాతోనే అద్భుతమైన అందుకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అద్భుతమైన దర్శకుడు దొరికాడు అని అనిపించుకున్నాడు. ఆ తర్వాత చేసిన బాచి(Bachi) సినిమా డిజాస్టర్ గా మిగిలింది. మళ్లీ రవితేజ(Raviteja) హీరోగా చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా మారాయి. చాలా చిన్న కాన్సెప్ట్ సినిమాలు పూరిని స్టార్ డైరెక్టర్ ను చేసేసాయి. పూరి స్టార్ డైరెక్టర్ అయిన తర్వాత చిన్న కాన్సెప్ట్ సినిమాలు చేయటం మానేశాడు. ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో పనిచేసిన ఘనత పూరి జగన్నాథ్ కి దక్కింది.

ఎన్టీఆర్ నటించిన టెంపర్(Temper) సినిమా తర్వాత ఇప్పటివరకు చెప్పుకోదగ్గ హిట్ సినిమా పూరి జగన్నాథ్ కెరియర్ లో పడలేదు. వరుస డిజాస్టర్ సినిమాలతో సతమతమవుతున్న తరుణంలో ఇస్మార్ట్ శంకర్(Ismart Shankar) సినిమా కొంత ఉపశమనం కలిగించింది. ఈ సినిమా తర్వాత పూరి ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. లైగర్ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కేవలం తెలుగులోనే మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో పరువును పోగొట్టుకున్నారు పూరీ జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda).ఈ సినిమాకి సంబంధించి చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు పూరి ఇంటి ముందు ధర్నాకు తిరిగే పరిస్థితి కూడా వచ్చింది.

పూరి పరిస్థితి అయోమయం

అయితే పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచే డివైడ్ టాకుతో ప్లాపును మూట కట్టుకుంది. ఈ సినిమా లాభాలు తీసుకొచ్చి పెడితే అందరికీ క్లియర్ చేసి పూరి ప్రశాంతంగా మరో సినిమా చేయాలనే ఆలోచనలో ఉండేవాడు. కానీ ఈ సినిమా కూడా తేడా కొట్టడంతో నెక్స్ట్ పూరి పరిస్థితి అయోమయంగా ఉంది. ఇదివరకే మొదలైన జనగణమన కూడా లైగర్ ఫలితం వలన ఆగిపోయింది. స్టార్ హీరోస్ ఎవరూ కూడా ప్రస్తుతం పూరికి డేట్స్ ఇచ్చేలా లేరు.

- Advertisement -

Double iSmart

ఇంకా పూరి ఏదో సాధిస్తాడు అని పూరి జగన్నాథ్ ను నమ్మి ఎవరైనా హీరో డేట్స్ ఇచ్చి, అన్ని పక్కన పెట్టి పూరి జగన్నాథ్ తన స్టామినాతో సరైన కథ రాసి, తన మేకింగ్ స్టైల్ తో త్వర త్వరగా పూర్తిచేసి రిలీజ్ చేసి హిట్టు కొడితే మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కే అవకాశం ఉంది. హిట్ కొట్టడం అనేది పూరికి పెద్ద పని కాదు. కానీ ఈ మధ్యకాలంలో పూరి సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయట్లేదు అని అందరికీ అర్థమైపోతుంది. ఏదేమైనా పూరికి మనం చెప్పే స్థాయిలో లేము పూరి తనకు తాను తెలుసుకొని బౌన్స్ బ్యాక్ ఇస్తే ఎంతో మంది అభిమానులు చాలా హ్యాపీగా ఉంటారనేది వాస్తవం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు