Puri Jagannath: భార్యతో విడాకులు.. అసలు నిజం తెలిసి..?

Puri Jagannath: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. తన అద్భుతమైన డైరెక్షన్ తో ఎంతోమంది హీరోలకు మంచి కెరియర్ను అందించిన ఘనత ఈయన సొంతం.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు బద్రి , మహేష్ బాబుకు పోకిరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది హీరోలకు మంచి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను అందించి వారి కెరియర్ ను మలుపు తిప్పారు. ఇక ప్రస్తుతం డైరెక్టర్గా నిర్మాతగా కూడా కొనసాగుతున్న ఈయన అప్పుడప్పుడు కొన్ని చిత్రాలలో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే పూరీ జగన్నాథ్ ప్రొఫెషనల్ గురించి అందరికీ తెలుసు.. కానీ వ్యక్తిగత జీవితం కేవలం కొంతమందికి మాత్రమే తెలుసు అని చెప్పవచ్చు.

Puri Jagannath: Divorce with wife.. Knowing the real truth..?
Puri Jagannath: Divorce with wife.. Knowing the real truth..?

ఆ హీరోయిన్ వల్లే విడాకులు..

ఇక ఈయన లావణ్య ను ప్రేమించి మరీ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అలాంటి వీరి మధ్య ప్రముఖ హీరోయిన్ ఛార్మి కౌర్ కారణంగా గొడవలు వచ్చాయని.. ఆమె వల్లే ఇద్దరూ విడిపోతున్నారంటూ కూడా వార్తలు వినిపించాయి. అయితే ఇవన్నీ కూడా రూమర్స్ అని తేలిపోయింది. ఇప్పుడు వీరిద్దరికి సంబంధించిన మరొక వార్త తెరపైకి రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోందని చెప్పవచ్చు. ఒకానొక సమయంలో పూరీ జగన్నాథ్ తన భార్యను వదిలేద్దామని అనుకున్నారట.. కానీ ఆమె గురించి ఒక విషయం తెలిసి ఆ ఆలోచనను విరమించుకున్నారట పూరీ జగన్నాథ్. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

పూరీ జగన్నాథ్ ప్రేమ, పెళ్లి..

పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు చేతుల్లో పెద్దగా డబ్బులు ఉండేవి కాదట. అందుకే సినిమాకు సంబంధించి పలు రకాల పనులు చేసే వారని సమాచారం.. అయితే ఈ విషయాలన్నీ ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు. ఒకసారి నా స్నేహితుడి సినిమాకు నేను ఘోస్ట్ డైరెక్షన్ చేయడానికి వెళ్ళాను . షూటింగ్ ఒక ఊర్లో జరుగుతోంది. ఆ షూటింగ్ చూడ్డానికి వచ్చిన జనాలలో ఒక అమ్మాయి నన్ను బాగా ఆకర్షించింది. షూటింగ్ చేస్తున్నంతసేపు నా దృష్టి అంతా ఆమెపైనే.. ఆమె మాత్రం షూటింగ్ చూస్తూ ఉండిపోయింది.. షూటింగ్ అయిపోయాక ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి.. నువ్వు నాకు చాలా నచ్చావు.. నేను కనుక నీకు నచ్చితే, పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే, నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి ఆ అమ్మాయికి నా నెంబర్ ఇచ్చాను.. కొన్నాళ్ళకు ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసింది.. ఇక ఆ పరిచయం ప్రేమగా మారింది.

- Advertisement -

అయితే ఒకరోజు అమ్మాయిని బయటికి తీసుకెళ్లాలని అనుకున్నాను.కానీ నా దగ్గర డబ్బులు లేవు. నా స్నేహితులు దగ్గర అప్పు తీసుకొని బయటకు వెళ్ళడానికి అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సమయంలో రూ.1500 జీతం ఇచ్చేవారు.. అందుకే నా గర్ల్ ఫ్రెండ్ ను రెస్టారెంట్లకు తీసుకెళ్లే అంత స్తోమత నాకు ఉండేది కాదు.. కానీ ఒకసారి ఆమె నన్ను కాస్ట్లీ రెస్టారెంట్ కి తీసుకెళ్ళింది. నా జేబులో డబ్బులు లేవని భయపడ్డాను.. అప్పుడు తాను ఒక ఫుల్ తందూరి కోడి ఆర్డర్ ఇచ్చింది.. నాకేమో భయం చుట్టుకుంది.. అంత డబ్బు నా దగ్గర లేదు కదా. ఒకవేళ తెలిస్తే అమ్మాయి నన్ను వదిలేస్తుందేమో అని.అందుకే తింటున్నట్టు నటించాను.. కానీ తానేమో ఫుల్లుగా లాగించేసింది. డబ్బులు సరిపోతాయా అనే భయం మరొకవైపు.. ఆమె ఇలా ఒక కోడిని మొత్తం తినేసరికి ఫ్యూచర్ ఏంటి అని భయం వేసింది.. నా దగ్గర జీతం సరిగ్గా లేదు ఆమెమో అలా తింటుంది.. ఇక ఆమె తిండికి తగ్గటైనా నేను సంపాదించాలి కదా అందుకే భయమేసి ఒకసారి డైరెక్ట్ గా చెప్పాను.. నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే డైరెక్ట్ గా అప్పుడే కలుద్దాం ..బయట తిరగడం ఇక బంద్ అని చెప్పేసాను. అయితే ఆమె నాపైన ఇష్టంతో ఇక ఏ రోజు కూడా అంతలా తినడం నేను చూడలేదు. అందుకే నా భార్య పైన నాకు ఎప్పటికీ ప్రేమ ఉంటుంది.. నన్ను అర్థం చేసుకుంది కాబట్టి ఆమెను వదిలేయాలనుకోలేదు ఆ తర్వాత స్నేహితుల సమక్షంలో మా పెళ్లి జరిగింది అంటూ తెలిపారు పూరీ జగన్నాథ్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు