Double Ismart : దారుణంగా పడిపోయిన డబుల్ ఇస్మార్ట్ బుకింగ్స్.. మళ్లీ చిక్కుల్లో పూరి..

Double Ismart : టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్.. ఈ సినిమా ఇండిపెండెన్స్ డే సందర్బంగా విడుదలై యావరేజ్ టాక్ అందుకుంది. అయితే ఈ సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోయినట్లు తెలుస్తుంది.పూరీ పూర్తిగా ప్రేక్షకులతో డిస్ కనెక్ట్ అయిపోయాడు అంటున్నారు. అస్సలే మాత్రం కన్విన్సింగ్ గా లేని కథ, కథనాలతో భారీగా ఖర్చు పెడుతూ పూరీ రూపొందించిన డబుల్ ఇస్మార్ట్ మూవీ హిట్ అనే మాట వినడం అసాధ్యం అనే చెప్పాలి. రామ్ క్యారెక్టరైజేషన్ మాత్రం ఎనర్జిటిక్ గా ఉన్నా.. స్టోరీ సిల్లీగా ఉండటంతో సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి..

దారుణంగా పడిపోయిన టికెట్ బుకింగ్స్..

పూరి జగన్నాథ్ కు ఈమధ్య పెద్దగా కలిసి రాలేదు.. బ్యాడ్ టైం నడుస్తుందని తెలుస్తుంది. ఎన్నో ఆశలతో డబుల్ ఇస్మార్ట్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆ సినిమా మొదటి టాక్ తోనే నెగిటివ్ టాక్ ను అందుకుంది. మొదటి రోజు వచ్చిన బుకింగ్స్ రెండో రోజు లేవని తెలుస్తుంది. మార్నింగ్ హావర్స్ షోకి ఒక్కో థియేటర్ కు 10 నుంచి 15 వేలే అయ్యినట్లు తెలుస్తుంది. ఇలా ఓపెనింగ్స్ కంటిన్యూ అయితే మాత్రం కోటి దాటడం కష్టమే అని తెలుస్తుంది. డబుల్ ఇస్మార్ట్ మూవీకి ఓపెనింగ్స్ వీక్ గానే వచ్చాయి. మొదటి రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి 5 కోట్లు వసూళ్లు మాత్రమే సాధించిందీ మూవీ. దీనికి కాస్త అటూ ఇటూగా కొన్ని ఫిగర్స్ మారొచ్చేమో కానీ మాగ్జిమం అయితే ఇదే అంటున్నారు..

Puri Jagannath double smart bookings which fell badly
Puri Jagannath double smart bookings which fell badly

అప్పుడు వరంగల్ శ్రీను, ఇప్పుడు నిరంజన్ రెడ్డి..

ఈ మూవీ రైట్స్ ను 40 కోట్లు పెట్టి కొన్నారు. ఓపెనింగ్స్ చూస్తే ఆ నలభైలో సగానికి పైగా లాస్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రామ్ ఎనర్జీ మొత్తం బూడిదలో పోసిన పన్నీరైందనే చెప్పాలి.. గతంలో పూరి లైగర్ సినిమా విషయంలో ఇదే పరిస్థితి ఎదురైంది. ఆ గొడవలు ఇప్పటికి తగ్గలేదు. నిన్న మొన్నటివరకు వరంగల్ శ్రీను అడ్డుగా మారిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు నిరంజన్ రెడ్డి పరిస్థితి అయోమయంలో పడింది. అప్పుల నుంచి బయట పడాలాంటే సినిమా 54 కోట్లు రాబట్టాలి. ఇస్మార్ట్ శంకర్ కు ఫస్ట్ డే ఓపెనింగ్స్ 7.65 కోట్లకు పైగా వచ్చాయి. అంటే హిట్ బొమ్మకు సీక్వెల్ అయినా.. రిలీజ్ కు ముందు బజ్ క్రియేట్ చేసినా ఓవరాల్ గా డబుల్ ఇస్మార్ట్ ను తెలుగు ఆడియన్స్ రిజెక్ట్ చేశారు అనే చెప్పాలి. రేపు వీకెండ్ కలెక్షన్స్ పెరుగుతాయేమో చూడాలి…

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు