Puri Jagannath: లెక్క తప్పింది గురు

పూరి జగన్నాథ్, గన్ నుంచి బుల్లెట్లు బయటకు వచ్చినట్లు ఈయన పెన్ నుంచి డైలాగులు బయటకు వస్తాయి. కేవలం ఒక డైలాగ్ తో సినిమా దిశా దశ రెండిటిని మార్చగల సామర్థ్యం ఉన్న దర్శకుడు. బద్రి సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన పూరి జగన్నాథ్ తర్వాత చిన్న కాన్సెప్ట్ సినిమాలతో సూపర్ హిట్ సినిమాలు చేసి స్టార్ డైరెక్టర్ గా, స్టార్ మేకర్ గా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు.

పూరి జగన్నాథ్ సినిమా వస్తుంది అంటే చాలు థియేటర్ దగ్గరకు ఆడియన్స్ పరుగులు తీసేవారు. పూరి డిజైన్ చేసిన క్యారెక్టర్ గురించి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ సినిమాకు వెళ్లేవారు. ఒక హీరోని మిగతా సినిమాల్లో చూడటం వేరు, పూరి జగన్నాథ్ సినిమాల్లో చూడటం వేరు. ఎందుకంటే ఆ హీరోలను పూరి చూపించే తీరు ఆ విధంగా ఉంటుంది.

మామూలుగా కథలు రాయటానికి కొందరు నెలలు తరబడి, ఇంకొందరు సంవత్సరాల తరబడి కూర్చుంటారు. కానీ పూరి జగన్నాథ్ అలా కాదు. కథకు ఒక వారం రోజులు డైలాగులుకు వారం రోజులు కూర్చుని, 60 నుంచి 70 రోజుల్లో ఒక సినిమాను పూర్తి చేసే సామర్థ్యం దర్శకుడు. కానీ ఇవన్నీ ఒకప్పుడు ఇప్పుడు పూరి కూడా లెక్కతప్పుతున్నాడు.

- Advertisement -

మామూలుగా ఒక సినిమాను మొదలుపెట్టినప్పుడే ఆ సినిమా రిలీజ్ డేట్ చెప్పి రిలీజ్ చేయడం పూరి కి ఉన్న అలవాటు. అలానే చాలా సినిమాలు షూటింగ్ కంటే ముందే రిలీజ్ డేట్ చెప్పి, పూర్తి చేసి, చెప్పిన టైం కి రిలీజ్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో అనౌన్స్ చేసిన టైం కి సినిమాలు రిలీజ్ అవ్వటం లేదు. ప్రస్తుతం పూరి సినిమా కూడా అదే కోవాలోకి వస్తుంది.

లైగర్ సినిమా తర్వాత కొంచెం టైం తీసుకుని పూరి జగన్నాథ్ చేస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమాని మార్చి 8న రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమాను ఇప్పుడు జూన్ 17న రిలీజ్ చేయనున్నారు. ఏదేమైనా ఈ సినిమా హిట్ అవ్వటం పూరి కెరీర్ కి చాలా అవసరం. ఎందుకంటే లైగర్ సినిమా పూరి జగన్నాద్ ను పాతాళానికి తొక్కేసింది. ఒకప్పుడు త్వరత్వరగా సినిమాలు చేసి ఇండస్ట్రీ హిట్ లు కొట్టే పూరి, ఇప్పుడు స్లోగా సినిమాలు చేయడం చాలా మందికి జీర్ణించుకోలేని విషయం అని కూడా చెప్పొచ్చు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు