HasiniSudhir : హీరోయిన్లకు రెస్పెక్ట్ ఇచ్చే ఇండస్ట్రీ ఇదొక్కటేనట..

HasiniSudhir : టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఏ స్థాయిలో రచ్చ జరుగుతుందో తెలిసిందే. తన ప్రేమ వ్యవహారం వల్ల రాజ్ తరుణ్ గురించి రోజుకో వార్త నెట్టింట వైరల్ అవుతుండగా, తాజాగా రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘పురుషోత్తముడు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. అయితే రాజ్ తరుణ్ పై ఉన్న వివాదాల కారణంగా తాను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేదు. వచ్చినా ప్రీ రిలీజ్ ఈవెంట్ సజావుగా జరగదని భావించినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా పురుషోత్తముడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రధాన తారాగణం కాకుండా చిత్ర యూనిట్ మొత్తం వచ్చినట్టు తెలుస్తుంది. బ్రహ్మానందం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఈ సినిమాలో హాసిని సుధీర్ హీరోయిన్ గా నటించింది. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ హాసిని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Purushottamudu Actress Hasini Sudhir about tollywood industry

రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన ‘పురుషోత్తముడు’ చిత్రంలో హాసిని సుధీర్‌ హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె మాట్లాడుతూ ముంబై నుండి వచ్చి తెలుగు సినిమాలు చేయడమనేది నా కల.. ఇప్పుడు ఆ డ్రీం నెరవేరిపోయింది. నేను తెలుగు సినిమాలు చూస్తూ తెలుగు నేర్చుకున్నాను. ఇక హాసిని మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్లకు చాలా రెస్పెక్ట్ ఇస్తారని, షూటింగ్ సెట్స్ లో గాని, ప్రమోషన్లలో గాని అమ్మ అమ్మా అని పిలుస్తారని, ఇంత రెస్పెక్ట్ ఏ ఇండస్ట్రీలో కూడా ఇవ్వలేదని చెప్పుకొచ్చింది హాసిని సుధీర్. అలాగే జులై 26న పురుషోత్తముడు సినిమా రిలీజ్ అవుతుందని తప్పకుండా చూడండని హాసిని చెప్పుకొచ్చింది.

- Advertisement -

అయితే మీడియా విలేఖర్లు రాజ్ తరుణ్ గురించి కూడా అడిగే ప్రయత్నం చేసారు. అయితే హాసిని ముందుగానే గమనించి రాజ్ తరుణ్ గురించి బయట వచ్చే వార్తల గురించి పెద్దగా తెలీదని, సెట్స్ లో మాత్రం డీసెంట్ గా ఉండేవాడని, షూటింగ్ అయిపోగానే, ఎవరి క్యారవాన్ లకు వాళ్ళు వెళ్లిపోయేవాళ్లమని చెప్పింది. ఇక పురుషోత్తముడు సినిమాకు రామ్‌ భీమన దర్శకత్వం వహించగా, డా.రమేశ్‌ తేజావత్‌, ప్రకాశ్‌ తేజావత్‌ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ నెల 26న సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, రాజారవీంద్ర, ప్రవీణ్‌ తదితరులు సినిమాలో నటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు