Pushpa 2 : అవతార్-2 తో పాటే..

ఐకాన్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2021 డిసెంబర్ 17న విడుదలై సూపర్ హిట్ సాధించింది. పుష్ప సీక్వెల్ గా పుష్ప 2 సినిమా వస్తున్న విషయం తెలిసిందే. పుష్పలో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా మాస్ లుక్ లో ఆకట్టుకున్నారు. పుష్ప 2 లో మాత్రం కొద్దిగా మార్పులతో అదే లుక్ ను కొనసాగిస్తారట. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ రూ.100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. 

పుష్ప 2 ఎప్పుడు వస్తుందా అని అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తకిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకొని పుష్ప2 ని అత్యున్నత టెక్నాలజీతో తెరకెక్కించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే నెలలో పుష్ప 2 కి సంబంధించి చిన్న వీడియో గ్లింప్స్ ని విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ సిద్ధమవుతున్నారు. 

తాజాగా అల్లు అర్జున్ లేకుండానే రామోజీ ఫిలింసిటీలో పుష్ప 2 షూటింగ్ కొనసాగిస్తున్నారట దర్శకుడు సుకుమార్. డిసెంబర్ 16న విడుదల కానున్న అవతార్ సినిమా తో పాటే పుష్ప 2 కి సంబంధించిన గ్లింప్స్ బయటికి వదిలేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇక అవతార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుండడంతో ఈ సినిమాతో పాటు పుష్ప 2 గ్లింప్స్ విడుదల చేస్తే ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని సుకుమార్ భావించాడు. ఈ వీడియో ద్వారా పుష్ప 2 సినిమా విడుదల ఎప్పుడు అనేది కూడా ఓ క్లారిటీ రానున్నట్టు సమాచారం. 

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు