Pushpa 2: అల్లు అర్జున్ చేసిన పనికి సుకుమార్ కి భయం పట్టుకుంది సినిమా ఫ్లాప్ అవుతుందేమో అని

Pushpa 2: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకరు. ఆర్య సినిమాతో దర్శకుడుగా పరిచయమైన సుకుమార్ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు. కొన్నిసార్లు సుకుమార్ తీసిన సినిమాలు ఫెయిల్ అయిన కూడా వాటికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అంత అద్భుతంగా సినిమాలను తెరకెక్కిస్తాడు సుకుమార్. సుకుమార్ తీసిన సినిమాలను ఇప్పటికీ బెస్ట్ ఫిలిమ్ అంటే రంగస్థలం అని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ సుకుమార్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా మాత్రం పుష్ప. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సంచలనం సృష్టించే కలెక్షన్ల వర్షం కురిపించింది.

పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందుకే ఇప్పుడు అందరూ పుష్పా ది రూల్ అనే సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 15 సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. అలానే హడావిడిగా ఈ సినిమా నుంచి రెండు పాటలను కూడా రిలీజ్ చేశారు. కానీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న టైంలో ఈ సినిమాను డిసెంబర్ కి పోస్ట్ పోన్ చేసింది చిత్ర యూనిట్. అయితే విఎఫ్ఎక్స్ ఇంకా పూర్తి కాలేదని, అలానే షూటింగ్ కూడా చాలా వరకు పెండింగ్ ఉందని ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసినట్లు ప్రకటించారు.

Pushpa 2

- Advertisement -

ఇకపోతే సోషల్ మీడియాలో దీని వెర్షన్ వేరేగా వినిపిస్తుంది. అల్లు అర్జున్ వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థికి నంద్యాల వెళ్లి సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ పై ట్రోల్స్ కూడా చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ మీద నెగెటివిటీ ఉన్న కారణంగానే ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసినట్లు సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

అయితే పుష్ప సినిమా జరుగుతున్న టైంలో సుకుమార్ కి భయం పట్టుకుంది అని రీసెంట్ గా ఒక ప్రొడక్షన్ బాయ్ ఇంటర్వ్యూ లో చెప్పిన మాటలు వైరల్ గా మారాయి. అల్లు అర్జున్ కి అలానే మెగా ఫ్యామిలీకి ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి. దీని వల్ల సినిమాకి ఇబ్బంది అవుతుంది అని సుకుమార్ బాధపడినట్లు ఆ ఇంటర్వ్యూలో ఆ సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు. అయితే దీనికి స్వయంగా అల్లు అర్జున్ పి ఆర్ టీం రియాక్ట్ అయింది. సెక్యూరిటీ గార్డ్ ని కూడా ఇంటర్వ్యూ చేసి ఏదో ఒకరకంగా విష ప్రచారం చేస్తారు అంటూ పిఆర్ టీం నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు