Pushpa 2: ఆ సినిమాలు నిజంగానే పూర్తయ్యాయా.? పుష్పరాజ్ వెనక్కు తగ్గడం వలన వస్తున్నారా.?

Pushpa 2: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ ఫిలిమ్స్ లో పుష్ప ఒకటి. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద సంచలనాన్ని క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఎస్ఎస్ రాజమౌళి తర్వాత అంత పెద్ద ఘనవిజయాన్ని అందుకుంటూ తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన ఘనత పుష్పా సినిమాకి ఉంది. ఈ సినిమాలో పుష్పరాజ్ క్యారెక్టర్ ని సుకుమార్ డిజైన్ చేసిన విధానం ప్రపంచ వ్యాప్తంగా ఆశ్చర్యానికి గురిచేసింది. పుష్పరాజ్ మేనరిజమ్స్, పుష్పరాజ్ ఆటిట్యూడ్ ఇవన్నీ కూడా ఈ సినిమాకి మంచి ప్లస్ అయ్యాయి.
కేవలం కలెక్షన్స్ను సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది ఈ సినిమా.

Pushpa 2-The Rule

అయితే పుష్ప సినిమా కి సీక్వెల్ గా పుష్ప టు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దానికోసమే ఎంతో వేగంగా ఈ సినిమా మూడు యూనిట్లుగా విడిపోయి మరి పని చేశారు. కానీ కొన్ని పనులు పెండింగ్ ఉండటం వలన ఈ సినిమాను చెప్పిన డేట్ కు రిలీజ్ చేయలేకపోతున్నారు. అయితే ఈ సినిమాను ఆగస్టు 15 కి రిలీజ్ చేస్తున్నారు అని తెలియటం వలన చాలా సినిమాలు కూడా తమ డేట్ ను వెనక్కి వేసుకున్నాయి. ఇప్పుడు ఆ డేట్ కి పుష్ప సినిమా రావట్లేదు అని తెలిసిన తర్వాత ఒక్కొక్కటిగా అన్ని సినిమాలు ముందుకు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలు నిజంగానే పూర్తయిపోయాయా, లేకపోతే పుష్ప డేట్ దొరికిందని ముందుకు వస్తున్నాయా అనేది కొంతమందికి ఉన్న సందేహం.

- Advertisement -

ఆగస్టు 15న పా రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ నటిస్తున్న తంగలను సినిమా కూడా రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే దీని గురించి ఇంకా అధికారకు ప్రకటన రావాల్సి ఉంది. అలానే దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లక్కీ భాస్కర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తున్న డబల్ ఇస్మార్ట్ శంకర్ కూడా ఆగస్టు 15 రిలీజ్ కానుంది. ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా హిట్ అవటం కూడా పూరి జగన్నాథ్ కి చాలా అవసరం. ఎందుకంటే ఇదే ఆగస్టు నెలలో వచ్చిన పూరి జగన్నా చివరి సినిమా తీవ్రమైన డిజాస్టర్ కు గురైంది. అక్కడి నుంచి పూరి జగన్నాథ్ కి కోలుకోవడానికి ఇంకా టైం సెట్ కాలేదు. ఈ సినిమా సెట్ అయితే పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చినట్లే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు