Pushpa 2: బాగానే ట్రై చేశారు కవర్ చేసుకోవడానికి… కానీ సింక్ అవ్వడం లేదు భయ్యా

Pushpa 2 : గత రెండు రోజులుగా అల్లు అర్జున్, సుకుమార్ మధ్య అంతా బాగాలేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి విదేశాల్లో విహారయాత్రలఓ బిజీగా ఉన్నాడు. ఆయన కత్తిరించిన గడ్డంతో కనిపించడంతో వివాదం మొదలైంది. అమెరికా వెళ్లిన సుకుమార్ ఇటీవలే హైదరాబాద్ చేరుకున్నాడు. అయితే పుష్ప 2 ఆగిపోయింది అనే వార్తలపై బన్నీ, సుకుమార్ ఇద్దరూ స్పందించలేదు. ఈ వివాదంపై అల్లు అర్జున్ సన్నిహితుడు బన్నీ వాస్ స్పందించారు. కానీ లాజిక్ ఏది భయ్యా ? అంటూ కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నారు నెటిజన్లు.

కవర్ చేయడానికి బన్నీవాస్ ప్రయత్నం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ పుష్ప 2 : ది రూల్. 2021లో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన పుష్ప మూవీకి సీక్వెల్ గా బన్నీ-సుకుమార్ కాంబోలో రాబోతున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వాయిదా పడగా, తాజాగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది అంటూ పెద్ద ఎత్తున రూమర్లు వైరల్ అవుతున్నాయి. హీరో డైరెక్టర్ మధ్య గ్యాప్ రావడం వల్ల ఈ సినిమా షూటింగ్ ఇంకా ఆలస్యం అవుతుంది అంటూ పుకార్డు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ వార్తలపై నిర్మాత బన్నీ వాస్ ఆయ్ మూవీ ప్రమోషన్లలో క్లారిటీ ఇచ్చారు. పుష్ప 2 షూటింగ్లో అల్లు అర్జున్ పార్ట్ ఇంకా కేవలం 15-20 రోజులు మాత్రమే ఉందని ఆయన తెలిపారు. ఎడిటింగ్ అయ్యాక బ్యాలెన్స్ షూటింగ్ ఏమైనా ఉంటే అప్పుడు పెట్టుకుందామని సుకుమార్ చెప్పారని స్పష్టం చేసిన బన్నీ వాస్, మళ్లీ షూటింగ్ స్టార్ట్ కావడానికి 30 నుంచి 35 రోజుల బ్రేక్ ఉండడంతో అల్లు అర్జున్ తన కుటుంబంతో హాలిడే కు వెళ్లాలనుకున్నాడని, అందుకే తన గడ్డానికి ట్రిమ్ చేసుకున్నారని వివరించారు. ఇక ఫస్ట్ హాఫ్ ను ఎడిట్ చేయాలని భావించిన సుకుమార్ కూడా షూటింగ్ కి కాస్త బ్రేక్ తీసుకున్నారని, ఆగస్టులో మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నారని క్లారిటీ ఇచ్చారు. అయితే బన్నీవాస్ బాగానే కవర్ చేసినప్పటికీ ఎక్కడో పడుతోంది అంటూ లాజిక్ లు లాగుతున్నారు నెటిజన్లు.

Allu Arjun and 'Pushpa 2' director Sukumar not on talking terms? Producer  Dheeraj reacts

ఇదెక్కడి లాజిక్ బన్నీ మావా ?

పుష్ప మూవీ కోసమే బన్నీ ఎప్పటినుంచో పొడవు గడ్డం, జులపాల జుట్టుతో మేకోవర్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. కానీ ఇప్పుడేమో ఇంకా షూటింగ్ పూర్తికాకముందే గడ్డానికి ట్రిమ్ చేశాడు. బన్నీ వాస్ స్వయంగా ప్రెస్ మీట్ లో ఎడిటింగ్ చూసుకున్నాక అవసరమైతే మళ్లీ షూట్ చేస్తారని చెప్పారు. కానీ నిజంగానే షూట్ చేయాల్సి వస్తే అప్పుడు బన్నీ గడ్డం సంగతేంటి? ఈ 25 రోజుల షూటింగ్ ను ఎలా చేస్తారు? విగ్ పెట్టి బ్యాలెన్స్ చేస్తారేమోలే అనుకోవడానికి సుకుమార్ ఒరిజినాలిటీని మాత్రమే ఇష్టపడతారు. అయితే ఈ 30-35 రోజుల గ్యాప్ లో ఎలా చూసుకున్నా గడ్డం అంతగా పెరగదు. దీంతో అల్లు అర్జున్, సుకుమార్ మధ్య ఉన్న విభేదాలు బయటపడకుండా బన్నీ వాస్ మేనేజ్ చేసాడు గానీ సింక్ అవ్వట్లేదు భయ్యా అంటున్నారు నెటిజన్లు. పైగా ఫహాద్ పాజిల్ పార్ట్ కూడా ఇంకా పూర్తి కాలేదు అంటున్నారు. మొత్తానికి బన్నీ వాస్తు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇంకా జనాలు సుకుమార్, బన్నీ మధ్య విభేదాలు లేవు అనే మాటను నమ్మట్లేదు. మరి మూవీ ఈసారైనా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా? అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు