Pushpa 2: అల్లు అర్జున్ రావట్లేదని బన్నీ వాసు ఇలా సెట్ చేసాడండి ఆయ్

Pushpa 2: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో అల్లు అర్జున్ ఒకరు. గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఆర్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ను వసూలు చేయడమే కాకుండా యూత్ లో కూడా మంచి క్రేజ్ ను సాధించుకుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ లవ్ స్టోరీస్ లో ఆర్య సినిమా కూడా ఒకటి అని చెప్పొచ్చు. ఈ సినిమాతోనే సుకుమార్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు.

ఇక అల్లు అర్జున్ ఫిల్మోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ప్రత్యేకమైన పాత్రలను ఎంచుకుంటూ తనను తాను మేక్ ఓవర్ చేసుకుంటూ ఎంతోమంది ఆడియన్స్ ను సాధించుకున్నాడు. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకున్నాడు. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎన్నో సంచలనాలకు తెరతీసింది. అద్భుతమైన కలెక్షన్స్ లో బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు చేసింది. ఇకపోతే పుష్ప సినిమాకి సీక్వెల్ గా పుష్ప ది రూల్ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. కానీ సినిమా షూటింగ్ పూర్తిస్థాయిలో అవ్వకపోవడం వలన చివరి నిమిషంలో వాయిదా వేశారు.

AAY

- Advertisement -

ఇకపోతే పుష్ప సినిమా ఆగస్టు 15 వస్తుంది అని చాలా సినిమాలు వెనక్కు తగ్గాయి. ఒక్కసారిగా పుష్ప సినిమా వాయిదా పడటంతో చాలా సినిమాలు ముందుకు వచ్చాయి. ప్రస్తుతం గీత ఆర్ట్స్ లో నిర్మితమవుతున్న సినిమాలో ఆయ్ సినిమా ఒకటి. ఈ సినిమా గోదావరి బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఈ సినిమాలో నర్నే నితిన్ హీరోగా నటిస్తున్నాడు. పుష్ప సినిమా పోస్ట్ పోన్ అయిన సందర్భంగా ఆగస్టు 15 కి ఆయ్ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు బన్నీ వాసు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు