Pushpa -2: పుష్ప-2 లో మార్పులు.. ఆందోళనలో ఫ్యాన్స్..!

Pushpa-2..తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రంగా పేరు పొందిన చిత్రాలలో పుష్ప-2 సినిమా కూడా ఒకటి. ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా.. అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయబోతున్నారు. పుష్ప-2 చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు.. అత్యధిక బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు.రు. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేసింది. దీంతో వరుసగా సినిమా అప్డేట్లను కూడా తెలియజేస్తూ వస్తుంది చిత్ర బృందం. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి.

ప్రెస్టేజియస్ గా తీసుకున్న బన్నీ..

Pushpa-2: Changes in Pushpa-2.. Fans are worried..!
Pushpa-2: Changes in Pushpa-2.. Fans are worried..!

ఈ సినిమా షూటింగ్ ఒకవైపు పూర్తి చేసుకునే పనిలో పడినప్పటికీ.. మరొకవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కూడా పూర్తి చేసేలా కనిపిస్తోంది. ఆగస్టు మొదటి వారంలో ఈ చిత్రం షూటింగ్ ని పూర్తి చేయబోతున్నట్లు సమాచారం. పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ విజయం కావడంతో పుష్ప-2 పై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అల్లు అర్జున్ కూడా ఈ చిత్రాన్ని చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులోని మొదటి భాగంలో నటినటులతో పాటు మరికొంతమందిని తీసుకురావడం జరిగింది.

తప్పుకున్న ఎడిటర్..

విలన్ గా ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు.. ఈ చిత్రానికి సంబంధించి కీలక అప్డేట్ ఒకటి వైరల్ గా మారుతోంది . అదేమిటంటే ఈ చిత్రానికి సంబంధించి ఎడిటర్ గా పనిచేస్తున్న కార్తీక్ శ్రీనివాస్ తప్పుకున్నారని.. సుకుమార్ తో కొన్ని డిఫరెన్స్ ల కారణంగా తప్పుకున్నట్లు తెలుస్తోంది.. దీంతో ఇప్పుడు కార్తీక్ స్థానంలో మరొక ఎడిటర్ నవీన్ నూలి ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పుష్ప-2 సినిమా విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ అడుగులు వేస్తున్నారు. అలాగే అవుట్ పుట్ విషయంలో కూడా ఎక్కడ లోటు లేకుండా చూసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఎన్నో చిత్రాలకు నవీన్ వర్క్ చేశారు.

- Advertisement -

అంచనాలు మాత్రం భారీగా..

మరోవైపు పుష్ప-2 సినిమా ఖచ్చితంగా రూ.1000 కోట్ల మార్క్ ను అందుకుంటుందని.. అభిమానులైతే చాలా ధీమాతో ఉంటున్నారు. ఈ సినిమా బిజినెస్ డీల్స్ కు సంబంధించి అన్ని ప్రాంతాలలో భారీగానే జరిగినట్లు తెలుస్తోంది. అలాగే డిజిటల్ రైట్స్, ఓటిటి రైట్స్ కూడా భారీ ధరకే అమ్ముడుపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం థియేటర్ బిజినెస్ పై కూడా కాస్త డిస్కషన్ జరుగుతున్నట్లు సమాచారం.. ఇదిలా ఉండగా మరోవైపు ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ కోసం జాన్వి కపూర్ ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. గతంలో పుష్ప సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ లో నటించి.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈమె పెర్ఫార్మెన్స్ సినిమాకి హైలైట్ గా నిలిచింది..మరి రెండవ భాగాన్ని అంతకుమించి తెరకేక్కిస్తున్నారు కాబట్టి ఎవరు ఈ సినిమాలో ఐటమ్ గర్ల్ గా నటించి ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి .అంతేకాదు అల్లు అర్జున్ ఏ స్థాయిలో పుష్ప-2 చిత్రంతో ఆకట్టుకుంటారో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు