Pushpa 2 Copy Song: ఇదేందయ్యా దేవిశ్రీ.. ఉన్న నమ్మకాన్ని పోగొట్టావుగా..?

Pushpa 2 Copy Song: సుకుమార్ దర్శకత్వంలో.. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా.. అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం పుష్ప -2.. గతంలో సైలెంట్ గా వచ్చి భారీ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డులు క్రియేట్ చేసిన పుష్ప సీక్వెల్ గా ఈ సినిమా రాబోతోంది.. దీంతో అందరి అంచనాలు ఈ సినిమా పైనే.. ముఖ్యంగా ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా నార్త్ లో రూ .100 కోట్ల క్లబ్లో చేరిన ఈ సినిమాపై ఇప్పుడు నార్త్ ఆడియన్స్ ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో పుష్ప 2 సినిమా నుంచి పుష్పరాజ్ అంటూ టైటిల్ సాంగ్ రిలీజ్ చేయగా.. ఈ సినిమా భారీగా యూట్యూబ్లో ట్రెండ్ అయ్యింది.. ఇక అంతేకాదు ఈ పాటకు సెలబ్రిటీలు సైతం రీల్స్ చేస్తూ తెగ వైరల్ చేశారు.. ఈ నేపథ్యంలోనే తాజాగా రెండు రోజుల క్రితం “సూసేకి అగ్గి రవ్వ లాగా ఉన్నాడే నా సామి” అంటూ కపుల్ సాంగ్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం..

సూసేకి కపుల్ సాంగ్ ను కాపీ కొట్టిన దేవి శ్రీ ప్రసాద్..

Pushpa 2 Copy Song: Is this Devishree.. have you lost your trust..?
Pushpa 2 Copy Song: Is this Devishree.. have you lost your trust..?

అయితే విడుదలైన 24 గంటల్లోనే తెలుగులో 11 మిలియన్ వ్యూస్ సాధించింది ఈ పాట. కానీ బాలీవుడ్ నుంచి కేవలం 6.7 మిలియన్ వ్యూస్ మాత్రమే రావడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. ముఖ్యంగా అతిపెద్ద మార్కెట్ అయినా బాలీవుడ్ నుంచే ఊహించని నెంబర్ రావడంతో పుష్ప 2 మార్కెట్ తగ్గిపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. దీనికి తోడు పుష్ప 2 సినిమా నుంచి తాజాగా విడుదల చేసిన ఈ పాటను దేవిశ్రీప్రసాద్ కాపీ కొట్టాడనే వార్తలు తెరపైకి రావడం మరింత కలకలం సృష్టిస్తోంది.

తెలంగాణ జానపద గేయాన్ని కాపీ..

అసలు విషయంలోకి వెళ్తే.. టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా దేవిశ్రీప్రసాద్ , ఎస్ఎస్ తమన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా మణిశర్మ హవా తగ్గిన తర్వాత వీరిద్దరూ జోరు చూపిస్తున్నారు కూడా..పైగా కాపీ ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు.. తమన్ అయితే ప్రతి సినిమాకి ఏదో ఒక పాట విషయంలో కాపీ చేసాడనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఇక దర్శకుడు సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకేక్కిస్తున్న పుష్ప 2 సాంగ్ కి కూడా కాపీ ఆరోపణలు తప్పలేదు. తాజాగా సూసేకి అనే పాట తెలంగాణ జానపద పాటకి కాపీ అని చెబుతున్నారు.. ఈ మేరకు రెండు సాంగ్స్ ని కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు కూడా వైరల్ అవుతున్నాయి..

- Advertisement -

కాపీ ఆరోపణ లు దేవిశ్రీ..

మరొకవైపు దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పుష్ప 2 సినిమాపై ఇలాంటి కాపీ ఆరోపణలు రావడం నిజంగా విచారకరమని చెప్పాలి. పుష్ప సక్సెస్ లో దేవిశ్రీ పాత్ర ఎంతగానో ఉంది. ఆయన స్వరపరిచిన బీజిఎం చాలా అద్భుతంగా కుదిరింది.. శ్రీవల్లి, సామి సామి, ఉ అంటావా ఉ ఊ అంటావా పాటలు యూట్యూబ్ లో ఎటువంటి రికార్ట్స్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ని ఊపేసాయి. ఇలాంటి నేపథ్యంలో భారీ అంచనాలు పెట్టుకున్న ఆడియన్స్ నమ్మకాన్ని దేవిశ్రీప్రసాద్ వమ్ము చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు