Pushpa 2 Couple Song : 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్… కానీ, ఈ సారి హిందీ వాళ్లు రిజెక్ట్ చేశారు..!

Pushpa 2 Couple Song.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అంటే కచ్చితంగా అభిమానులను మెప్పిస్తుందనే నమ్మకం ఏర్పడింది.. అలా ఇప్పటివరకు ఆర్య, ఆర్య-2, పుష్ప వంటి చిత్రాలను తెరకెక్కించగా.. ప్రస్తుతం పుష్ప -2 సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పైన కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషన్స్ లో శరవేగంగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక నటిస్తోంది. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయడానికి చిత్ర బృందం పక్కా ప్రణాళికతోనే ముందుకు వెళుతున్నారు.

Pushpa 2 Couple Song : Record views within 24 hours... But this time the Hindi people rejected it..!
Pushpa 2 Couple Song : Record views within 24 hours… But this time the Hindi people rejected it..!

ఈ ఏడాది ఆగస్టు 15న అన్ని భాషలలో విడుదల చేయడానికి సన్నహాలు చేస్తూనే.. మరొకవైపు సినిమాకు సంబంధించి అప్డేట్లను అందిస్తూ ఉంది చిత్ర బృందం. ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్, గ్లింప్స్, పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నిన్నటి రోజున పుష్ప-2 నుంచి “సూసేకి అగ్గి రవ్వ మాదిరిగా ఉంటాడే నా సామి”.. అనే కపుల్ సాంగ్ ని విడుదల చేశారు. ఈ పాటను చంద్రబోస్ రచించినప్పటికీ ప్రముఖ పాపులర్ సింగ్ శ్రేయా ఘోషల్ మొత్తం 6 భాషలలో పాడింది. ఇదే ఈ పాటకి మంచి హైప్ ను తీసుకువచ్చింది.

ప్రస్తుతం ఈ సాంగ్ ట్రెండింగ్ అవుతున్నప్పటికీ కూడా అభిమానులను పెద్దగా మెప్పించలేకపోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. నిజానికీ 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టినప్పటికీ.. హిందీ ప్రేక్షకులను మాత్రం ఈ పాట పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో రిజెక్ట్ చేసినట్లుగా సమాచారం. ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప సినిమా విషయంలో బాలీవుడ్ పరిశ్రమ చాలా కీలకంగా వ్యవహరించింది.. అక్కడే భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా భారీ కలెక్షన్లను కూడా రాబట్టింది. పుష్ప సినిమాలోని పాటలకు కూడా చాలామంది సెలబ్రిటీలు రీల్స్ చేసి మరీ వైరల్ చేశారు. సెలబ్రిటీలే కాదు ప్రముఖ ప్లేయర్స్ కూడా ఈ సినిమాలోని సిగ్నేచర్ స్టెప్స్ కి రీల్స్ చేసి మరి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. దీంతో సీక్వెల్ పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

- Advertisement -

అందుకే పుష్ప-2 చిత్రానికి భారీ హైప్ ఏర్పడిన నేపథ్యంలో.. ఈసారి రూ .1000 కోట్ల టార్గెట్ ను బరిలోకి పెట్టుకొని మరి దిగుతున్నారు.. ఇలాంటి సమయంలో అన్ని భాషలలో కూడా పుష్ప-2 కి ప్రమోషన్స్ ద్వారా మంచి హైప్ తీసుకువచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు సడన్గా బాలీవుడ్ లో కపుల్ సాంగ్ రిజెక్ట్ చేయడంతో చిత్ర బృందం కాస్త కంగు తిన్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా విడుదలైన 24 గంటల్లోనే తెలుగులో 11 మిలియన్ వ్యూస్ రాబట్టగా హిందీలో కేవలం 6.7 M వ్యూస్ మాత్రమే వచ్చాయి. మరి ఐటెం సాంగ్ తో అయినా బాలీవుడ్లో పుష్ప-2 సినిమా మంచి హైప్ ఏర్పరచుకుంటే .. ఇక ట్రైలర్ తో ఎలాగోలాగా మంచి హైప్ ఏర్పడుతుంది. ఇలా జరిగితేనే కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతుందని అభిమానుల సైతం తెలియజేస్తున్నారు. మరి తదుపరిపాట విషయంలో మేకర్స్ ఏమాత్రం తమ ప్రూవ్ చేసుకుంటారు చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు