Pushpa 2 First Single : పుష్ప రాజ్ మాస్ సెన్సేషన్

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబినేషన్లో వచ్చిన ఆర్య సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే వీరి కాంబినేషన్లో ఆర్య సినిమా ఇద్దరికీ ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. తర్వాత అల్లు అర్జున్ ఎంత మందితో సినిమాలు చేసిన, సుకుమార్ ఎంతమందితో సినిమాలు చేసిన కానీ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ అంటే మాత్రం వేరే లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు.

వీరిద్దరూ కలిసి సంచలనం సృష్టించిన పుష్ప సినిమా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచం మొత్తం పుష్ప సినిమా సృష్టించిన సెన్సేషన్ ని చూసింది. అయితే కేవలం భారత దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా పుష్ప ప్రభంజనం చూపింది. అందుకనే ప్రస్తుతం పుష్ప 2 సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే పుష్ప క్యారెక్టర్ని సుకుమార్ డిజైన్ చేసిన విధానం, ఆ క్యారెక్టర్ని అల్లు అర్జున్ పెర్ఫామ్ చేసే విధానం ఇదంతా కూడా ప్రపంచ ఆడియన్స్ కి పిచ్చెక్కించేలా చేసింది.

స్పోర్ట్స్ మెన్స్, పొలిటిషియన్స్ అందరూ కూడా పుష్ప మ్యానరిజమ్స్ విరివిగా వాడేసారు. అంతలా ఇంపాక్ట్ చూపించింది పుష్ప సినిమా. ఇకపోతే పుష్ప సినిమాకి సీక్వెల్ గా పుష్ప2 వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసింది చిత్రం యూనిట్. అయితే ఈ సాంగ్ ని చంద్రబోస్ రచించారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అయితే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటుంది.

- Advertisement -

పుష్పాకు చంద్రబోస్ ఇచ్చిన ఎలివేషన్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు. అయితే పుష్ప క్యారెక్టర్ మొత్తం ఈ సాంగ్ ఎలివేట్ చేస్తుంది. ఒక గన్ నుంచి తూటా బయటికి వెళ్తే మళ్లీ వెనక్కి రానట్లు పుష్పా ఇచ్చిన మాట కూడా అంతే. పుష్ప ఒక మాట ఇచ్చాడు అంటే మళ్ళీ వెనక్కి తీసుకోడు అని చాలా డైలాగ్స్ ని సాహిత్యంలో పొందుపరిచారు చంద్రబోస్.

ఈ సాంగ్ కూడా సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ను పెంచిందని చెప్పొచ్చు. ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా కొన్ని డాన్స్ మూమెంట్స్ ని కూడా దీనిలో పొందుపరిచారు. ఇకపోతే ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిందని చెప్పచ్చు. అలానే ఈ సాంగ్ మరిన్ని రికార్డ్స్ ను సొంతం చేసుకోబోతుంది అని కూడా చాలామంది ఊహిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు