Pushpa 2: నాలుగు గంటల ఫుటేజ్. సినిమానా, సీరియలా, వెబ్ సిరీసా.?

Pushpa 2: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వస్తున్న సినిమాలు గురించి ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తూ ఉన్నారు. ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికి తీసుకెళ్ళిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాను తీస్తున్నప్పుడు ప్రభాస్ కి అంత మార్కెట్ లేదు డెఫినెట్ గా ఈ సినిమా ప్లాప్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. ఈ సినిమాకి మొదట డిజాస్టర్ టాక్ వచ్చింది ఆ తర్వాత సినిమా మెల్లమెల్లగా పుంజుకుంది. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా ఈ సినిమా నిలిచింది.

Pushpa 2: The Rule

బాహుబలి సినిమా తర్వాత ఒక్కసారిగా తెలుగు సినిమా వైపు చాలామంది చూడటం మొదలుపెట్టారు. తెలుగు దర్శకులు కు కూడా మంచి గౌరవం ఇచ్చారు. తెలుగు సినిమాల కోసం వెయిట్ చేయడం కూడా మొదలుపెట్టారు. ఇకపోతే తెలుగులో వస్తున్న బిగ్గెస్ట్ ఫిలిమ్స్ లో పుష్ప ఒకటి. ఇప్పటివరకు ఎదురుచూసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయిపోయాయి. అయితే పుష్ప సినిమాను ఆగస్టు 15 న రిలీజ్ చేస్తారని అధికారికంగా ప్రకటించారు. ఆ సినిమాకి సంబంధించిన పాటలను కూడా హడావిడిగా రిలీజ్ చేశారు. సినిమా టైంలో రిలీజ్ కష్టం అని వస్తున్న చాలా రూమర్లకు ధీటుగా సమాధానం చెప్పారు.

- Advertisement -

ఇకపోతే ఆగస్టు 15న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను డిసెంబర్ 6వ తేదీకి పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే డిసెంబర్లో కూడా ఈ సినిమా వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఇప్పటివరకు జరిగిన ఫుటేజ్ దాదాపు నాలుగు గంటల వరకు వచ్చిందని సమాచారం వినిపిస్తుంది. నాలుగు గంటలు ఫుటేజ్ వచ్చినా కూడా సినిమా ఇంకా పూర్తి కాలేదు అని తెలుస్తుంది. నాలుగు గంటలు ఫుటేజ్ వచ్చింది అని తెలియగానే చాలామంది సీరియల్ తీస్తున్నారా వెబ్ సిరీస్ తీస్తున్నారు అంటూ కామెంట్ చేయడం కూడా మొదలుపెట్టారు. ఏదేమైనా ప్రస్తుతం పుష్ప సినిమాకు పైన చాలా అంశాలు చర్చనీయాంశంగా మారాయి వీటిపై మేకర్స్ క్లారిటీ ఇస్తే గాని ఒక అవగాహన రాదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు