Pushpa 2: విశాఖలో పుష్ప రాజ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప ది రైజ్” సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంటర్నేషనల్ రేంజ్ లో ఈ సినిమాకి రీచ్ దక్కింది. ఈ సినిమాకి కొనసాగింపుగా పుష్ప ది రూల్ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను మొదలుపెట్టి కొద్దిమేరా పూర్తి చేశారు. ఇటీవలే కొద్ది రోజులుగా హైదరాబాద్ లో ఈ సినిమాలోని కీలక సన్నివేశాలని తెరకెక్కించారు.

కొత్తగా నిర్మించిన అల్లు స్టూడియోస్ లో ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను తెరకెక్కించినట్లుగా సమాచారం. అయితే ఇప్పుడు ఈ సినిమాలోని మరికొన్ని సన్నివేశాలను విశాఖపట్నంలో చిత్రీకరణ జరపనున్నారు. అందుకోసం బుధవారమే అల్లు అర్జున్ విశాఖపట్నం చేరుకున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపారు. పది రోజులకి పైగా అక్కడ చిత్రీకరణ జరపనున్నట్లు తెలిసింది.

మరోవైపు ఈ సినిమాలోని హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన వచ్చే నెలలో సినిమా సెట్ లోకి అడుగు పెట్టబోతున్నట్టు తెలిపారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి ఇప్పటికే కొన్ని ట్యూన్స్ ని అందించాడట. ట్యూన్స్ మంచి మాస్ గా ఉన్నాయి అంటూ సుకుమార్ భావించడంతోపాటు అల్లు అర్జున్ కూడా విన్నారట. మొదటి పార్ట్ కి మించి మ్యూజిక్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

- Advertisement -

మొత్తానికి పుష్ప 2 సినిమా యొక్క అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై నవీన్ యుర్నెని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి 20 కి పైగా దేశాలలో విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట సుకుమార్. మొత్తానికి ఈ అప్డేట్స్ అల్లు అర్జున్ అభిమానుల్లో బోలెడన్ని అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు