Pushpa 2 Release Date : పుష్ప రాజ్ అసలు తగ్గేదేలే… మళ్లీ వాయిదాపై స్ట్రాంగ్ కౌంటర్

Pushpa 2 Release Date : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అందరూ ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో పుష్ప ఒకటి. మామూలుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ పై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్న కాంబినేషన్లో అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ ఒకటి. ఆర్య సినిమాతో మొదలైన వీరి పరిచయం చాలా సక్సెస్ఫుల్గా కొనసాగింది. చాలామంది డైరెక్టర్లతో బన్నీ వర్క్ చేసినా కూడా సుకుమార్ అంటేనే బన్నీకి ప్రత్యేకమని చెప్పొచ్చు. ఇదివరకే బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మూడు సినిమాలు చేశాడు. మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. అలానే సుకుమార్ తో కూడా ఇప్పటివరకు మూడు సినిమాలు చేశాడు. వాటిలో ఆర్య 2 సినిమా అంతంత మాత్రమే ఆడిన పుష్ప మాత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. ఆ సినిమాలో డైలాగ్ లాగానే ఎక్కడా తగ్గకుండా కెరియర్ లో ముందుకు వెళ్తూనే ఉన్నాడు. తనకంటూ ఒక సపరేట్ ఆర్మీ ని ఫార్మ్ చేసుకున్నాడు. అలానే రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక టైటిల్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఇంకా ఆ సాంగ్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా అల్లు అర్జున్ ఎలివేట్ చేస్తూనే ఉంటుంది ఆ పాట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతి రూమర్ కి కౌంటర్ గా ఆ పాటను వాడుతూ ఉంటారు. అంత బాగా రాశాడు చంద్రబోస్ ఆ పాటను. ఇకపోతే ఈ సినిమా గురించి రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా వివాదాలు వినిపిస్తూ వచ్చాయి. కొంతమంది కావాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా సినిమాని టార్గెట్ చేశారు అంటూ వార్తలు కూడా వినిపించాయి.

Allu Arjun's Pushpa The Rule

- Advertisement -

ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు. అలానే హడావిడిగా రెండు పాటలను కూడా ఈ సినిమా నుంచి రిలీజ్ చేశారు. ఈ రెండు పాటలు కూడా సినిమా మీద అంచనాలను మరింత పెంచాయి. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన కొంతమేరకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ షూటింగ్ బ్యాలెన్స్ ఉండటం వలన ఈ సినిమాను కాస్త డిసెంబర్ 6 కి పోస్ట్ పోన్ చేశారు. అయితే డిసెంబర్ 6న కూడా ఈ సినిమా రావడం కష్టం. ఈ సినిమాకి కంటిన్యూటీ షూట్ ఉండగానే అల్లు అర్జున్ గడ్డం తీసేసి విదేశాలకు చెక్కేశాడు. దర్శకుడు కి అల్లు అర్జున్ కు మధ్య చాలా విభేదాలు వచ్చాయని రీసెంట్ టైమ్స్ లో గట్టిగా వినిపించాయి.

వాయిదాపై స్ట్రాంగ్ కౌంటర్

కాగా వీటన్నిటికీ బన్నీ వాసు, ధీరజ్ వంటి యంగ్ నిర్మాతలు కూడా క్లారిటీ ఇచ్చారు.ఇకపోతే పుష్ప సినిమా రిలీజ్ గురించి ఇప్పుడు అధికారికంగా మరోసారి ప్రకటించింది చిత్ర యూనిట్. తగ్గేదేలే అంటూ డిసెంబర్ 6న పుష్ప సినిమా రిలీజ్ అవుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ సినిమాలోని పుష్ప టైటిల్ సాంగ్ లిరిక్స్ కూడా షేర్ చేసి, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు