Pushpa 2 Second Single : పుష్ప 2 కపుల్ సాంగ్ వచ్చేసింది.. పూనకాలే ఇక

Pushpa 2 Second Single : 2024లోనే మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 ప్రమోషన్స్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు మేకర్స్. అందులో భాగంగానే గత కొన్ని రోజుల నుంచి పుష్ప 2 నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నాము అంటూ ఊరిస్తూ వస్తున్నారు. తాజాగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ సాంగ్ వచ్చేసింది.

సూసేకి సాంగ్ సూపర్

పుష్ప 2 మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప మెగా సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలోనే మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నాము అంటూ మేకర్స్ రిలీజ్ డేట్, టైంను అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఈ మూవీలో శ్రీవల్లి పాత్రను పోషించిన రష్మిక మందన్న కూడా ఒక కొత్త పోస్టర్ ను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అయితే అంతకంటే ముందే రష్మిక ఈ పాట కోసం రెడీ అవుతున్న ప్రోమోను రిలీజ్ చేసి ఆసక్తిని పెంచేశారు మేకర్స్. ఇక తాజాగా షేర్ చేసిన సెకండ్ సింగిల్ పోస్టర్లో రష్మిక, అల్లు అర్జున్ కలిసి డాన్స్ చేస్తున్నట్టుగా చూపించారు. ఇందులో రష్మిక వెరైటీ అవుట్ ఫిట్ లో కనిపించడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ పోస్టర్ రిలీజ్ అయిన నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్ రావడం విశేషం. ఈరోజు ఉదయం 11:07 గంటలకు పాటను విడుదల చేయబోతున్నామని మేకర్స్ చెప్పారు. నిన్నటి నుంచి ఈ సాంగ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్న అల్లు అర్జున్ అభిమానుల నిరీక్షణకు ఇప్పుడు తెరపడింది. తాజాగా పుష్ప 2 నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది.

సూసేకి నిప్పురవ్వలా ఉంటాడు నా సామి అనే పాటను ఆరు భాషల్లో రిలీజ్ చేశారు. ఈ పాటకు సింగింగ్ క్వీన్ శ్రేయ ఘోషల్ పాడగా, ప్రస్తుతం వ్యూస్ పరంగా ఈ సాంగ్ దూసుకెళ్తోంది.

- Advertisement -

గతంలో సామి సామి… ఇప్పుడు సూసేకి..

ఫస్ట్ పార్ట్ పుష్ప మూవీలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అలాగే శ్రీవల్లీ, సామీ సామి సాంగ్స్ కూడా అదరగొట్టాయి. ఇప్పుడు రిలీజ్ అయిన సూసేకి సాంగ్ కూడా సామీ సామీ పాటలాగే అద్భుతంగా ఉంది.

Pushpa 2: गाने की रिलीज से पहले श्रीवल्ली और पुष्पा ने बढ़ाई गर्मी, रश्मिका-अल्लू के लुक से नहीं हटेंगी नजरें - Pushpa 2: Allu Arjun, Rashmika Mandanna look out from song ...

ఆరు భాషల్లో ఓకే సింగర్…

పుష్ప 2 మూవీ నుంచి తాజాగా రిలీజ్ చేసిన రెండో పాట ఆరు భాషల్లో రిలీజ్ అయ్యింది. ది కపుల్ సాంగ్ అంటూ మేకర్స్ కొత్త పేరు పెట్టిన ఈ పాటను స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ ఆలపించారు. ఆమె ఈ పాటను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ ఇలా ఆరు భాషల్లో ఒక్కరే పాడడం విశేషం. ఇక ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ను అందించారు. మరి సూసేకి సాంగ్ ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి. ఈ పాట గనక థియేటర్లలో పడితే పూనకాలు పక్కా.

100 మిలియన్ వ్యూస్

ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప యూట్యూబ్‌లో మొత్తం ఆరు భాషల్లో 2.26 మిలియన్ల లైక్‌లతో, 100 మిలియన్లకు పైగా వ్యూస్ థి రికార్డులను బ్రేక్ చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు