Pushpa 2 : గాసిప్స్‌ను కంట్రోల్ చేయడానికే షూటింగ్ అనౌన్స్‌మెంట్… కానీ, వాస్తవం ఏంటంటే..?

Pushpa 2 : ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2.. టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. గతంలో వచ్చిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. విడుదల తేదీ రెండోసారి అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి సినిమా పై గాసిప్స్ ఎక్కువగా వస్తున్నాయి. సినిమా నుంచి హీరో, డైరెక్టర్ తప్పుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి వాస్తవమే.. ఈ వార్తలకు చెక్ పెడుతూ నిన్న సినిమా క్లైమాక్స్ సీన్ షూటింగ్ అంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే అది నిజం కాదని వార్తలు వినిపిస్తున్నాయి.. అసలు విషయం ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

ఏపీ ఎన్నికల ప్రభావం పుష్ప పై పడిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వలేదని సినీ ఇండస్ట్రీ అల్లు అర్జున్ పై పగ పట్టినట్లు దారుణమైన ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ కూడా సినిమా నుంచి తప్పుకున్నట్లు గుసగుసలు వినిపించాయి. ఇక బన్నీ కూడా గడ్డం తియ్యడంతో ఈ వార్తలు ఊపందుకున్నాయి.. అయితే ఈ వార్తలకు చెక్ పెట్టేందుకు మేకర్స్ ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.. ఆ వీడియో నిజం కాదని టాక్. నిజానికి పుష్ప2 షూటింగ్ ఏం జరగడం లేదు. జస్ట్ సినిమా క్యాన్సిల్ అయింది.. హీరోకు డైరెక్టర్ కు గొడవలు అవుతున్నాయని వస్తున్న గాసిప్స్ ను కంట్రోల్ చేయడానికే పుష్ప 2 టీం అలాంటి అప్డేట్ ఇచ్చినట్లు సమాచారం.. ఈ వార్త విన్న ఫ్యాన్స్ సినిమాను మళ్ళీ పోస్ట్ ఫోన్ చేస్తారా అని టెన్షన్ పడుతున్నారు.. మరి దీనిపై టీమ్ ఎలా స్పందిస్తారో చూడాలి..

Pushpa 2 shooting update was given to check the gossips
Pushpa 2 shooting update was given to check the gossips

ఈ సినిమాను మొదట ఆగస్టు 15 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. షూటింగ్ పెండింగ్ ఉన్న నేపథ్యంలో సినిమా విడుదల డిసెంబర్ 6 కు వాయిదా పడింది.. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన స్పెషల్ సెట్‌లో క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు. ఈ షెడ్యూల్‌లో హీరోతో పాటు సినిమాలోని కీలక నటులు పాల్గొంటున్నారు. ఈ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని, ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయని చెప్పారు. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా, ఫహాద్ ఫాజిల్, జగదీష్, అనసూయ, సునీల్, ధనుంజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాదు భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా నుంచి బయటకు వచ్చిన అప్డేట్స్ భారీ హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. మరి సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.. ఇక తర్వాత బన్నీ త్రివిక్రమ్ కాంబోలో సినిమా చేస్తున్నాడు.. పురాణాల ఆధారంగా సినిమా రాబోతుందని సమాచారం. దీని గురించి అధికార ప్రకటన అయితే రాలేదు. త్వరలో షూటింగ్ అప్డేట్ రాబోతుందని సమాచారం..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు