Pushpa 2 Song : పార్ట్ వన్ తెచ్చిన తలనొప్పి… ఆ రికార్డులను అందుకోవడానికి చెమట చిందిస్తున్నారు..!

Pushpa 2 Song: సాధారణంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది.. అందులో భాగంగా మొదటి భాగం రికార్డులు సాధిస్తే రెండవ భాగం కూడా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్ .. అయితే ఇక్కడ వచ్చిన చిక్కంతా మొదటి సినిమా రికార్డులు సాధించింది అంటే.. ఆ సినిమాకు మించి సీక్వెల్ ను తెరకెక్కించాల్సి ఉంటుంది.. లేకపోతే మొదటి సినిమా తెచ్చిన క్రేజ్ వినియోగించుకోలేకపోతారు.. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి పాన్ ఇండియా రేంజ్ లో విజయాన్ని అందుకొని రికార్డులు క్రియేట్ చేసిన పుష్ప సినిమా బాలీవుడ్ లో ఎటువంటి ప్రమోషన్స్ లేకుండానే రూ .100 కోట్ల మార్క్ దాటేసింది. దీంతో అందరూ చూపు పుష్ప 2 పైనే..

రామోజీ ఫిలిం సిటీ లో పుష్ప – 2 షూటింగ్..

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా భారీ రికార్డ్స్ క్రియేట్ చేయడమే కాదు ఈ సినిమాలోని పాటలు యూట్యూబ్లో ట్రెండ్ సెట్ చేశాయి కూడా.. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పుష్ప సీక్వెల్ పుష్ప 2 రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ ను ఇటీవల విడుదల చేయగా ఈ పాట కూడా బాగానే యూట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ సర్వేగంగా కొనసాగుతోంది.. టైటిల్ సాంగ్ కు విశేష స్పందన వచ్చిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే రెండవ పాటను కూడా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్..

రేపే కపుల్ సాంగ్..

Pushpa 2 Song : The headache brought by part one... They are sweating to get those records..!
Pushpa 2 Song : The headache brought by part one… They are sweating to get those records..!

రేపు మే 29న ఉదయం 11:07 నిమిషాలకి కపుల్ పాటను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ పాటలో రష్మిక మందన్న , అల్లు అర్జున్ తమ స్టెప్పులతో మరింత ఆకట్టుకోబోతున్నారు. అంతేకాదు దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం పుష్పరాజ్ – శ్రీవల్లి మధ్య ఉన్న కెమిస్ట్రీని హైలెట్ చేయనుంది.. అయితే ఇది కాస్త కొత్తగా కపుల్ సాంగ్ అంటూ ప్రమోట్ చేయడం మొదలు పెట్టేశారు.. వాస్తవానికి రేపు విడుదల చేయబోతున్న ఈ పాటకు ఈరోజు నుంచే ప్రమోషన్స్ చేపట్టడం ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది… “చూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామీ” అని సాగే ఈ పాటలో. తన ఐకానిక్ స్టెప్పులతో ఈ జోడి ఆకట్టుకోబోతున్నారు..

- Advertisement -

రికార్డుల కోసం పరితపిస్తున్న చిత్ర బృందం

ఈ కపుల్ సాంగ్ ను శ్రేయా ఘోషల్ పాడారు.. పాట మంచి మెలోడీగా ఉండేలా ఉంది.. అంతేకాదు ఈమె ఏకంగా ఆరు భాషల్లో ఈ పాటను పాడడంతో ట్విట్టర్లో ఇదే విషయాన్ని ఆమె షేర్ చేసి సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేసుకుంటోంది కూడా. అలాగే ట్విట్టర్లో రష్మిక మందన్న కూడా ట్రెండ్ అలెర్ట్ అంటూ ట్వీట్ చేసింది.. ఈ విషయాన్ని దేవిశ్రీప్రసాద్ కూడా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నాడు.. ముఖ్యంగా ఫస్ట్ పాట లాగే దీన్ని కూడా మోస్ట్ వ్యూస్ వచ్చేలాగా సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు.

కష్టం ఫలిస్తుందా..

పుష్ప1 లాగా ఈ సినిమా పాటలు కూడా హిట్ అవ్వాలని తెగ కష్టపడి పోతున్నారు చిత్ర బృందం.. మొత్తానికైతే పార్ట్ వన్ క్రియేట్ చేసిన రికార్డులను అందుకోవడానికి ఇప్పుడు చిత్ర బృందం చెమటలు చిందిస్తున్నారని చెప్పవచ్చు.. మరి వీరి కష్టం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు