Pushpa 2: ఆరేళ్ల నుంచి సుకుమార్ దీని మీద కూర్చున్నాడు మినిమం 1000 కోట్లు రావాల్సిందే

Pushpa 2: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో మొదటి వినిపించే పేరు ఎస్ఎస్ రాజమౌళి అయితే ఆ తర్వాత వినిపించే పేరు సుకుమార్. ఆర్య సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సుకుమార్. అయితే సుకుమార్ ఆర్య సినిమా చూసినప్పుడే నాకు ఎవడో పెద్ద కాంపిటీషన్ ఇవ్వబోతున్నాడు అని అర్థం చేసుకున్నాడు ఎస్ఎస్ రాజమౌళి. అలానే వీడితో ఫ్రెండ్షిప్ చేసుకుంటే మనకు బాగుంటుంది అని కూడా ఫీలయ్యాడట ఆ రోజుల్లో ఈ విషయాన్ని స్వయంగా ఎస్ఎస్ రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అలానే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నేనొక్కడినే సినిమా ఫెయిల్ అయినప్పుడు కూడా ఎస్ఎస్ రాజమౌళి సుకుమార్ వైపు నిలబడి ఇంటర్వ్యూ కూడా చేశాడు.

ఇక పుష్ప సినిమాతో సుకుమార్ పాన్ ఇండియా దర్శకుడు అయిపోయిన సంగతి తెలిసిందే. ఒకసారిగా తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి ప్రపంచవ్యాప్తంగా తెలిసి వచ్చింది ఈ సినిమాతో. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ ను సుకుమార్ డిజైన్ చేసిన విధానం అద్భుతం అని చెప్పొచ్చు. పుష్ప సినిమా ఎన్నో రికార్డులను సృష్టించింది. అద్భుతమైన కలెక్షన్స్ కూడా వసూలు చేసింది. లేకపోతే చాలామంది సుకుమార్ కెరియర్ లో బెస్ట్ ఫిలిం ఏది అని అంటే రంగస్థలం అని చెబుతారు. కానీ గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం పుష్ప సినిమా అని చెప్పాలి.

ఇక పుష్ప పార్ట్ వన్ ఊహించని రీతిలో హిట్ అయిన తర్వాత పుష్ప సినిమా పార్ట్ 2 కోసం చాలామంది వెయిట్ చేయటం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ అవుతుందని అధికారికంగా ప్రకటించిన తర్వాత కొన్ని పనులు పూర్తి అవ్వకపోవడం వలన దీనిని వాయిదా వేశారు. ఆగస్టు 15 సినిమా రిలీజ్ అని హడావిడిగా రెండు పాటలను కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇకపోతే ఈ సినిమా డిసెంబర్ 6న రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

- Advertisement -

Pushpa

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్తగా ఒక చర్చ నడుస్తుంది. పుష్ప సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు సాధించి తీరాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దాదాపు ఆరేళ్ల నుండి ఈ సినిమా పైన కూర్చున్నాడు సుకుమార్. ఇప్పుడు వస్తున్న సినిమాల టార్గెట్ అంతా కూడా 1000 కోట్ల పైనే. అలానే పుష్ప సినిమా కూడా దాదాపు 1000 కోట్లు సాధిస్తేనే అచీవ్మెంట్ అవుతుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాకు అంత స్కోప్ కూడా ఉంది రిలీజ్ తర్వాత దీని రిజల్ట్ ఏంటో తెలియనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు