Pushpa 2 The Couple Song : మొత్తానికి ఏదో దాస్తున్నారు భయ్యా… కానీ, చిన్న హింట్ వదిలారు

Pushpa 2 The Couple Song : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2 నుంచి తాజాగా సెకండ్ సింగిల్ వచ్చేసింది. అల్లు ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సూసేకి అగ్గి రవ్వ మాదిరిగా ఉంటాడే నా సామి పాటను మేకర్స్ బుధవారం చెప్పిన టైంకి రిలీజ్ చేశారు. ఈ పాట ఫోక్ స్టైల్ లో మాస్ ట్యూన్స్ తో రొమాంటిక్ ఫీల్ తో సాగింది. శ్రేయా ఘోషల్ పాడిన ఈ ది కపుల్ సాంగ్ రిలీజ్ అయిన క్షణాల్లోనే ట్రెండింగ్ గా మారింది. అయితే పాట చూశాక మొత్తానికి ఏదో దాస్తున్నారు భయ్యా… కానీ చిన్న హింట్ వదిలారు అనిపించింది. అసలు పుష్ప 2 మేకర్స్ ఏం దాస్తున్నారు? అనే వివరాల్లోకి వెళ్తే…

ఇదే దాస్తున్నారా?

తాజాగా రిలీజ్ అయిన ది కపుల్ సాంగ్ కు చంద్రబోస్ సాహిత్యం సమకూర్చగా, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈ సూసేకి పాటకు గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించారు. ఇక పాటలో అల్లు అర్జున్, రష్మిక మందన్న కెమిస్ట్రీ మరోసారి అదుర్స్ అనిపించింది. ఈ రొమాంటిక్ లో పుష్పరాజ్, శ్రీవల్లి మరోసారి ఐకానిక్ డాన్స్ స్టెప్పులతో కనిపించారు. అలాగే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ క్యాచీ ట్యూన్స్ తో అదరగొట్టేసారు. ఈ పాటను ఒకేసారి తెలుగుతో పాటు మలయాళ, కన్నడ, తమిళం ఇలా మొత్తం ఆరు భాషల్లో రిలీజ్ చేశారు. అన్ని భాషల్లోనూ ఈ పాటను శ్రేయ ఘోషల్ ఒక్కరే పాడటం విశేషం.

PUSHPA 2 THE RULE - SOOSEKI Full Video Song|SOOSEKI Lyrical Song|SOOSEKI Song|Pushpa 2 Songs|AA|DSP

- Advertisement -

ఇక అసలు విషయంలోకి వెళ్తే సూసేకి పాటను రిలీజ్ చేశారు. కానీ ఎక్కడా కూడా పాటలో హీరో హీరోయిన్ల గెటప్స్ రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు. లిరికల్ సాంగ్ అంటూ దీనికోసం ప్రత్యేకంగా షూటింగ్లోని పలు బిహైండ్ సీన్స్ ను స్పెషల్ గా షూట్ చేశారు. అలా మెయిన్ సాంగ్ కాకుండా ఈ అనౌన్స్మెంట్ కోసం స్పెషల్ గా షూట్ చేయడం విశేషం. మొత్తానికి ఈ పాటలో హీరో హీరోయిన్ ఎలాంటి కాస్ట్యూమ్స్, ఎలాంటి గెటప్ లో ఉంటారు అనే విషయాన్ని అస్సలు చూపించలేదు. దీంతో అభిమానులు ముందుగా రిలీజ్ చేసిన ఆ పోస్టర్ ను చూసి సరి పెట్టుకోవాల్సి వస్తోంది. అయితే నిజానికి మూవీ రిలీజ్ కి ఇంకా చాలా టైం ఉండడంతో ప్రేక్షకుల్లో మరింత ఆకలిని పెంచడానికి ఇలాంటి ప్రమోషనల్ స్టంట్స్ ఉపయోగిస్తున్నారు మేకర్స్.

హింట్ ఏంటంటే?

పుష్ప ఫస్ట్ పార్ట్ లో పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. దీనికోసం ప్రత్యేకంగా మేకర్స్ ఏమీ ప్లాన్ చేయలేదు. ఎప్పటిలాగే పాటలను రిలీజ్ చేశారు. కానీ సెకండ్ పార్ట్ విషయంలో మాత్రం తెగ ఊరిస్తున్నారు. అసలు విషయాలను దాచి సినిమాపై ఇంకా హైప్ తీసుకురావాలి అనుకుంటున్నారు. సెకండ్ పార్ట్ లో ప్రత్యేకంగా పాటలకు మంచి పేరు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఎక్కడా కూడా అసలు విషయాలను రివీల్ చేయకుండా ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటిలాగే జస్ట్ ఐకానిక్ స్టెప్స్ ను మళ్లీ మళ్లీ ఈ పాటలో చూపించారు. దీనివల్ల ఇప్పటి నుంచే కపుల్స్ ఇన్స్టాలో రీల్స్ చేసి పాటను వైరల్ చేసే ఛాన్స్ ఉంది. ఫలితంగా మేకర్స్ అనుకున్న హైప్ ఈజీగా వచ్చేస్తుంది. అయితే సుకుమార్ ఫాలో అవుతున్న ఈ స్ట్రాటజీ సినిమాకు ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు