Pushpa 2 The Rule : కల్కి, దేవరకు కలిసొచ్చిన ఆ ఒక్కటే పుష్పకు డిస్ అడ్వాంటేజ్

Pushpa 2 The Rule : టాలీవుడ్లో ద్వితీయార్థం భారీ పాన్ ఇండియా సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ పోరు ఎక్కువగా ఉండబోతోంది. ఇప్పటికే కల్కి మూవీ రిలీజై, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1000 కోట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. ఇక ఏడాది సెకండ్ హాఫ్ లో టాలీవుడ్ నుంచి పలు భారీ అంచనాలున్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో దేవర, పుష్ప 2, గేమ్ ఛేంజర్ సినిమాలు మోస్ట్ అవైటెడ్ లిస్టులో ఉన్నాయి. అయితే పుష్ప 2 మూవీ విషయంలో మాత్రం అల్లు అభిమానులకు నిరాశపరిచే డిసడ్వాంటేజ్ ఒకటి ఉంది. కానీ కల్కి, దేవర సినిమాలకు మాత్రం మంచి అడ్వాంటేజ్ ఉంది.

దేవర, గేమ్ ఛేంజర్ లకు ఉన్న అడ్వాంటేజ్…

ఈ ఏడాది జూన్ 27న కల్కి మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసింది. అయితే ఈ పాన్ ఇండియా మూవీకి బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మూవీ రిలీజ్ అయిన దరిదాపుల్లో ఏ చిత్రం కూడా థియేటర్లోకి వచ్చే ధైర్యం చేయలేదు. భారతీయుడు 2 మూవీ రిలీజ్ అయినా మొదటి నుంచి దానిపై ఆశలే లేవు. కాబట్టి అసలు లెక్కలోనే లేకుండా పోయింది. దీంతో 25 రోజులు దాటినప్పటికీ ఇంకా కల్కి కలెక్షన్ల జోరు కొనసాగుతోంది. ఆగస్టు 15 వరకు కల్కి ఇలాగే థియేట్రికల్ రన్ కొనసాగించే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఈ మూవీకి లాంగ్ రన్ భలేగా కలిసి వచ్చింది.

ఇక దేవర మూవీకి కూడా ఇదే అడ్వాంటేజ్ కాబోతోంది. సెప్టెంబర్ 27న మ్యాన్ ఆఫ్ మాసేస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీకి లాంగ్ రన్ అడ్డంకులు లేకుండా కొనసాగనుంది. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత తెలుగులో ఆ స్థాయిలో ఇతర సినిమాలేవి రిలీజ్ కావట్లేదు. అయితే దేవర కంటే ముందే అంటే అక్టోబర్లో కంగువ, వెట్టాయన్ లాంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. కానీ ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ దేవరను బీట్ చేయడం మాత్రం కష్టమే. అలా మొత్తానికి దేవరకు గనక పాజిటివ్ టాక్ వస్తే నవంబర్ ఆఖరి వరకు తెలుగులో లాంగ్ రన్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ పుష్ప విషయంలో మాత్రం ఈ అడ్వాంటేజ్ లేదు.

- Advertisement -

Pushpa: The Rule - Team heading for a song shoot soon

పుష్ప 2కు ఇదే డిస్ అడ్వాంటేజ్

పుష్ప 2 మూవీ ఆగస్ట్ నుంచి డిసెంబర్ 6 కు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా పొలిటికల్ మూవీ గేమ్ చేంజర్ కూడా డిసెంబర్ లోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ మూవీ డిసెంబర్ 20న రిలీజ్ కాబోతోందని ప్రచారం జరుగుతుంది. అంటే పుష్ప 2 మూవీ రిలీజ్ అయిన 15 రోజుల్లోనే గేమ్ ఛేంజర్ థియేటర్లలోకి రాబోతోంది. దీంతో కేవలం పుష్పకు 15 రోజుల థియేటర్ రన్ కు మాత్రమే అవకాశం ఉంటుంది. అంటే ఈ 15 రోజుల్లోనే పుష్ప కలెక్షన్లను రాబట్టుకోగలగాలి. ఆ తర్వాత గేమ్ చేజర్ వల్ల థియేటర్లు తగ్గడం ఖాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు