Pushpa 2: అప్పుడు ఇలానే జరిగింది, అసలు పుష్ప సినిమాకే ఎందుకు ఇలా.?

Pushpa 2: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కి ఉన్న క్రేజ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు అందులో సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ ఒకటి. ఆర్య సినిమాతో దర్శకుడుగా కెరియర్ మొదలుపెట్టాడు సుకుమార్. ఆ సినిమాలో వన్ సైడ్ లవ్ అంటూ ఒక కొత్త కాన్సెప్ట్ ని పరిచయం చేసి యూత్ ని అట్రాక్ట్ చేశాడు. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన కూడా, ఆర్య సినిమా అల్లు అర్జున్ స్టార్ ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టింది అని చెప్పొచ్చు.

Pushpa: The Rise

అల్లు అర్జున్ కెరియర్ లో ఎంతమంది దర్శకులతో పనిచేసిన కూడా సుకుమార్ కి అల్లు అర్జున్ కి ఉన్న బాండ్ వేరు. అలానే అల్లు అర్జున్ ఎక్కువసార్లు పనిచేసిన దర్శకుల జాబితాలో సుకుమార్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉంటారు. అల్లు అర్జున్ ఇప్పటివరకు త్రివిక్రమ్ తో చేసిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించి పెట్టింది. ఇక సుకుమార్ తో చేసిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయి గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది.

- Advertisement -

Pushpa 2-The Rule

కేవలం పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు మాత్రమే కాకుండా నేషనల్ అవార్డు ను కూడా తీసుకొచ్చి పెట్టింది పుష్ప. అయితే పుష్ప సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ ఎంత చెప్పినా తక్కువే. క్రికెటర్స్ , పొలిటికల్ లీడర్స్ ఈ సినిమాలోని డైలాగులు ఎంతగా వాడుకున్నారో సోషల్ మీడియాలో మనం ఇదివరకే చూశాం. ఇకపోతే పుష్ప – 2 ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

కానీ పుష్ప 2 కొంత మేరకు షూటింగ్ ఫినిష్ కాకపోవటం. విఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్ ఉండటం వలన ఈ సినిమాను డిసెంబర్ నెలకి పోస్ట్ పనిచేశారు. అప్పుడు కూడా పుష్ప సినిమాను ఆగస్టు నెలలో రిలీజ్ చేస్తున్నామని చెప్పి డిసెంబర్ కి పోస్ట్ పోన్ చేశారు. అయితే అప్పుడు ఇప్పుడు యాదృచ్ఛికంగా ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం మాత్రం కామన్ గా జరిగింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు