Allu Arjun on Pushpa 2 : ఇప్పటికీ ఆయన లేకుంటే నేను లేను… బన్నీ రెస్పాన్స్ అదిరింది

Pushpa 2 Update : మోస్ట్ అవైటింగ్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2 విషయంలో రోజుకో వార్త తెరపైకి వస్తోంది. తాజాగా అల్లు అర్జున్ గడ్డం విషయం, ఆయనోవైపు, డైరెక్టర్ సుకుమార్ మరోవైపు ట్రిప్పులకు వెళ్లడంతో పుష్ప 2 మూవీ షూటింగ్ ఆగిపోయింది అంటూ రూమర్లు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ విషయంపై బన్నీ టీం క్లారిటీ ఇచ్చింది. అసలు ఏం జరిగిందో తెలుపుతూ వివరణ ఇచ్చారు. మరి సుకుమార్, బన్నీ మధ్య నిజంగానే గొడవ జరిగిందా? అంటే…

బన్నీ, సుకుమార్ గొడవపై క్లారిటీ…

అల్లు అర్జున్ తన జీవితంలో ఐదు సంవత్సరాలను పుష్ప మూవీ కోసమే అంకితం చేశాడు. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పుష్ప 2 కోసం రెండు సంవత్సరాలకు పైగా సమయాన్ని కేటాయించారు. అయితే ఈ మూవీ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. నిజానికి పెద్దగా వీఎఫ్ఎక్స్ తో పని లేని కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ మూవీ. అయినప్పటికీ రిలీజ్ విషయంలో ఇంకా ఆలస్యం జరుగుతూనే ఉంది. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ అయి ఉండాల్సింది. కానీ వివిధ కారణాల వల్ల ఇంకా సెట్స్ పైనే ఉండడంతో పాటు ఇటీవల జరిగిన పలు సంఘటనల వల్ల అల్లు అర్జున్, సుకుమార్ మధ్య గొడవ జరిగిందంటూ కోలీవుడ్ చెందిన సోషల్ మీడియా పేజీలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ విషయంపై బన్నీ టీం క్లారిటీ ఇచ్చింది. సుకుమార్ యూఎస్ కు, బన్నీ యూరప్ కు ట్రిప్ వెళ్లారు. అక్కడ ఇద్దరికీ ఉన్న వేరే పనుల వల్ల పుష్ప 2 మూవీ షూటింగ్ ఆగిపోయింది. బన్నీ సుకుమార్ క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సమస్య లేదు. డిసెంబర్ 6న ఈ మూవీని ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేస్తాము అంటూ ప్రకటించారు.

Allu Arjun Wishes Pushpa Director Sukumar On His Birthday; Check It Out - News18

- Advertisement -

రూమర్లకు కారణం ఏంటంటే?

అయితే బన్నీ టీం నుంచి ఇలా అఫీషియల్ గా వివరణ వచ్చినప్పటికీ అది నమ్మశక్యంగా అనిపించడం లేదు. వీలైనంత తొందరగా సినిమాను పూర్తి చేయాలి. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరగాల్సి ఉంది. ఇలాంటి టైమ్ లో ఇలా పుష్ప 2 షూటింగ్ ను పక్కన పెట్టి మరీ వెకేషన్లను ఎంజాయ్ చేసేంత టైమ్ నిజంగానే వాళ్ళకు ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక తాజాగా అల్లు అర్జున్ ట్రిప్ కు వెళ్తున్నట్టుగా వైరల్ అవుతున్న వీడియోలో అల్లు అర్జున్ తన గడ్డాన్ని ట్రిమ్ చేసి కన్పించడం ఈ అనుమానాలకు దారి తీసింది. మళ్లీ సినిమా కోసం గడ్డం పెంచాలంటే దాదాపు 30 నుంచి 40 రోజులు పడుతుంది. కాబట్టి పుష్ప 2 షూటింగ్ ఆగిపోయిందని, ఇలాగైతే డిసెంబర్ 6న కూడా సినిమా రిలీజ్ కాకపోవచ్చు అని పుకార్లు షికార్లు చేశాయి. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు ప్రకారం ఈ మూవీ షూటింగ్ ఇంకా 30 రోజుల పాటు జరగాల్సి ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే బన్నీ సుకుమార్ మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే మూవీ షూటింగ్ ఆపేసి ఇద్దరు చెరోవైపు వెకేషన్ కి వెళ్ళారని వార్తలు వినిపించాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు