Pushpa 2 Update: ప్రీ పబ్లిసిటీ… అల్లు అర్జున్ గడ్డం వివాదంపై క్లారిటీ ఇచ్చిన బన్నీ వాస్

Pushpa 2 Update : గత కొన్ని రోజుల నుంచి పుష్ప 2 మూవీ షూటింగ్ ఆగిపోయింది అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ రోజురోజుకూ ఆలస్యం అవుతున్న కారణంగా అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ పని తీరుపై అసంతృప్తిగా ఉన్నాడని, ఇద్దరి మధ్య గొడవలు రావడంతో హీరో ఒకవైపు, డైరెక్టర్ మరొకవైపు వెకేషన్ పేరుతో విదేశాలకు వెళ్లిపోయారని టాక్ నడిచింది. అయితే ఇప్పటికే ఈ వివాదంపై బన్నీ టీం క్లారిటీ ఇవ్వగా, తాజాగా అల్లు అరవింద్ కుటుంబానికి సన్నిహితుడైన నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. ఈ పుకార్లపై క్లారిటీ ఇవ్వడమే కాదు సినిమా ఎంత దాకా వచ్చింది అన్న అప్డేట్ ని కూడా ఇచ్చారు.

బన్నీ వాస్ రియాక్షన్

గతం రెండ్రోజుల నుంచి సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఓ విమానంలో గడ్డం ట్రిమ్ చేసుకుని కనిపించిన వీడియో తెగ వైరల్ అయింది. దాన్ని చూసాక పుష్ప 2 సినిమా షూటింగ్లో జరుగుతున్న జాప్యం కారణంగా అల్లు అర్జున్ సుకుమార్ తో గొడవ పడ్డారని, ఈ విభేదాల కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో ఇద్దరూ విదేశాలకు ట్రిప్ పేరుతో వెళ్లిపోయారని వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత ఆ వార్తలన్నీ పుకార్లేనని మేకర్స్ కొట్టి పారేశారు. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వైరల్ అవుతున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక తాజాగా ఇదే విషయంపై నిర్మాత బన్నీ వాసు స్పందించారు. పుష్ప గురించి మీడియాలో ప్రజలు అవుతున్న కథనాలను చూసి తమను నవ్వుకుంటున్నామని చెప్పిన బన్నీ వాస్ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది అన్న విషయంపై అప్డేట్ ఇచ్చారు.

Pushpa 2 Hindi: This Strategy Won't Work In North

- Advertisement -

గడ్డం వివాదంపై వివరణ…

పుష్ప 2 మూవీ షూటింగ్ లో అల్లు అర్జున్ పార్ట్ ఇంకా 15 రోజుల నుంచి 20 రోజులలోపే ఉందని, ఈ కొన్ని రోజులు షూటింగ్ అయిపోతే పుష్ప 2 చిత్రీకరణ పూర్తయినట్టేనని బన్నీ వాస్ చెప్పుకొచ్చారు. సుకుమార్ ఎడిటింగ్ వెర్షన్ చూసాక ఏమన్నా చేంజ్ చేయాలా లేదా అనే క్లారిటీతో షూటింగ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నారని ఇప్పుడు ఎందుకు షూట్ ఆగిపోయింది అనే డౌట్ కు సమాధానం ఇచ్చారు. అందుకే అల్లు అర్జున్ కూడా సుకుమార్ చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తన గడ్డాన్ని ట్రిమ్ చేశారని, అల్లు అర్జున్-సుకుమార్ ఇద్దరి బాండింగ్ లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. కాగా ఆగస్టు ఫస్ట్ వీక్ లో ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలవుతుందని, ఆ ఫేక్ వార్తలను నమ్మొద్దు అంటూ అసలు విషయాని వెల్లడించారు. ఇక చివరగా ఈ రూమర్ల వల్ల మాకు ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది అంటూ పంచ్ వేశారు బన్నీ వాస్. ఇప్పటిదాకా మూవీ షూటింగ్ గురించి పలు రకాల అనుమానాలతో సతమతం అవుతున్న అల్లు అభిమానులు బన్నీ వాస్ చల్లటి కబురుతో కూల్ అయ్యారు. బన్నీ వాస్ నిర్మిస్తున్న ఆయ్ మూవీ ప్రమోషన్లలో ఇదంతా జరిగింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు