Pushpa 2 Update : మళ్ళీ మొదలైన పుష్ప… బన్నీ, సుకుమార్ గొడవ సద్దుమణిగినట్టేనా?

Pushpa 2 Update : మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 : ది రూల్ విషయంలో గత కొంతకాలంగా క్రేజీ రూమర్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తయని అందుకే సినిమా షూటింగ్ ఆగిపోయిందని విపరీతంగా రూమర్లు వైరల్ అవుతున్నాయి. ఈ కారణంగానే డైరెక్టర్ సుక్కూ అమెరికా నుంచి తిరిగి వచ్చేలోపే అల్లు అర్జున్ యూరప్ ట్రిప్ చెక్కేశారని వార్తలు వచ్చాయి. కానీ ఎప్పటికప్పుడు చిత్ర బృందం వీళ్ళ మధ్య ఎలాంటి గొడవలు లేవంటూ క్లారిటీ ఇస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 షూటింగ్ మళ్లీ షురూ అయింది.

అల్లు అర్జున్ లేకుండానే షూటింగ్…

జూలై 23న పుష్ప 2 మూవీ షూటింగ్ రీస్టార్ట్ అయ్యింది. రామోజీ ఫిలిం సిటీలో తాజాగా చిత్రీకరణను స్టార్ట్ చేశారు డైరెక్టర్ సుకుమార్. ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్ లేని సీన్లను షూట్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇటీవల అమెరికా నుంచి తిరుగు వచ్చిన సుకుమార్ సినిమా రిలీజ్ లో జాప్యం జరగకూడదనే ఉద్దేశంతో మళ్లీ ఎలాంటి బ్రేక్ ఇవ్వకుండా షూటింగ్ ను షురూ చేశారు. ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఓ స్పెషల్ సాంగ్ తో పాటు కొన్ని ఫైట్ సీన్లు మాత్రమే మిగిలి ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా మరికొన్ని రీ షూట్లకు కూడా ప్లాన్ చేస్తున్నారట సుక్కూ. అల్లు అర్జున్ తన ట్రిప్ నుంచి తిరిగి వచ్చాక షూటింగ్లో పాల్గొంటారని సమాచారం.

Pushpa 2 Shooting: పుష్ప 2 సినిమా షూటింగ్ మళ్లీ షురూ.. ఎప్పటి నుంచంటే!

- Advertisement -

బన్నీ, సుక్కు గొడవలు సద్దుమణిగినట్టేనా?

అయితే నిజానికి పుష్ప 2 మూవీ విషయంలో షూటింగ్ రోజు రోజుకూ ఆలస్యం అవుతుందన్న కారణంతో అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ పై గుర్రుగా ఉన్నారు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. అలాగే సినిమా షూటింగ్ ను పక్కన పెట్టి సుక్కూ సడన్ గా అమెరికా వెళ్లడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నాడంటూ ఫిలిం నగర్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ యూరప్ ట్రిప్ కి గడ్డం కట్ చేసుకుని మరీ వెళ్లడం ఆ రూమర్లకు ఆజ్యం పోసింది. మొత్తానికి వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్రతరం కావడంతో సినిమా మరోసారి వాయిదా పడబోతుంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ రీసెంట్ గా నిర్మాత బన్నీ వాసు.. సుకుమార్, అల్లు అర్జున్ మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ ఆయన మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో సినిమా వాయిదా పడడం ఖాయం అంటూ వార్తలు వినిపించాయి. కానీ రిలీజ్ వాయిదా పడుతుంది అంటూ వస్తున్న పుకార్లను పుకార్లుగానే మిగిల్చడానికి చిత్ర బృందం గట్టిగానే కష్టపడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సుక్కు షూటింగ్ ను రీస్టార్ట్ చేశారు. దీంతో బన్నీ, సుక్కు మధ్య విబేధాలు సద్దుమణిగినట్టే అంటున్నారు నెటిజన్లు. ఏదేమైనా సరే డిసెంబర్ 6న పుష్ప 2 మూవీని థియేటర్లలోకి వదులుతామని బల్లగుద్ది మరీ చెప్తోంది టీం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు