Pushpa 2 : మేం క్లైమాక్స్ షూట్ లో ఉన్నాం మీరు డిస్టర్బ్ చేస్తే ఇబ్బంది అవుతుంది – సుకుమార్

Pushpa 2 : సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పుష్ప. ఈ సినిమా ఎంత పెద్ద ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయింది. ఈ సినిమాలోని డైలాగ్స్ విపరీతంగా పాపులర్ అయ్యాయి. పొలిటిషియన్స్ స్పోర్ట్స్ మెన్స్ ఈ డైలాగులు ఎక్కడబడితే అక్కడ వాడటం మొదలుపెట్టారు. ఇకపోతే ఈ సినిమాకి సీక్వల్ గా పుష్ప 2 సినిమా రానుంది. ఈ సినిమాను డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమాను మొదట ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసి, హడావిడిగా ఈ సినిమా నుంచి రెండు పాటలు కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ పాటలకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ కొన్ని పనులు పెండింగ్ లో ఉండటం వలన ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. అయితే డిసెంబర్ 6న కూడా ఈ సినిమా వస్తుందని చాలామందికి నమ్మకాలు లేవు. కానీ నిన్న సుకుమార్ మాట్లాడిన మాటలతో చాలామందికి ఒక క్లారిటీ వచ్చేసింది.

Allu Arjun

- Advertisement -

పుష్ప సినిమా గురించి చాలా వార్తలు వినిపిస్తూ వచ్చాయి.దర్శకుడికి హీరోకి మధ్య గొడవలు జరుగుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం పుష్ప సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ షూటింగ్ జరుగుతున్నట్లు అధికారికంగా క్లారిటీ ఇచ్చేసాడు సుకుమార్. మారుతి నగర్ సుబ్రమణ్యం అని సినిమా ఈవెంట్ కు హాజరైన సుకుమార్ మాట్లాడుతూ క్లైమాక్స్ షూటింగ్లో ఉన్నాము మీరు డిస్టర్బ్ చేయకండి అంటూ ఆడియన్స్ కి చెప్పాడు. దీంతో సినిమా ఖచ్చితంగా డిసెంబర్ 6న రిలీజ్ కాబోతుందని అందరికీ క్లారిటీ వచ్చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు