Pushpa 2 : పుష్ప తరువాత అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి.?

Pushpa 2 : గంగోత్రి(Gangotri) సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్(Allu Arjun). మొదటి సినిమాతోనే నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సాధించుకున్నాడు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య(Aarya) సినిమా అల్లు అర్జున్ కి మంచి పేరును తీసుకొచ్చింది. ఆ సినిమాతో అల్లు అర్జున్ లో ఒక సరికొత్త యాంగిల్ బయటకు వచ్చిందని చెప్పొచ్చు. ఆర్య రోల్ ను బన్నీ పోషించిన విధానం చాలామందిని ఆకట్టుకుంది.

ఆ తర్వాత చాలా సినిమాలు చేశాడు అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్(Allu Arjun) సినిమాలన్నీ ఒక ఎత్తు. సుకుమార్(Sukumar) దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఒక ఎత్తు. పుష్ప సినిమా అల్లు అర్జున్ కి ఎంత పెద్ద ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ట్ చేసేసింది పుష్ప సినిమా. నేషనల్ అవార్డును కూడా తీసుకొచ్చింది ఆ సినిమా.

అయితే పుష్ప సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. సెలబ్రిటీస్, క్రికెటర్స్, పొలిటిషియన్స్ చాలామంది ఆ సినిమాలోని తగ్గేదేలే అనే డైలాగ్ ని ఎక్కడా తగ్గకుండా ఉపయోగించడం మొదలుపెట్టారు. అక్కడితో సినిమా అంచలంచెలుగా ప్రపంచం మొత్తం పాకుతూ పోయింది. అలానే సినిమాలో అల్లు అర్జున్ పర్ఫామెన్స్ కూడా అదే లెవెల్ లో ఇచ్చాడు అని చెప్పొచ్చు.

- Advertisement -

Allu Arjun

ఈ సినిమాకి సీక్వల్ గా పుష్ప 2(Pushpa 2) సినిమాని సుకుమార్(Sukumar) తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 6న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయనున్నాడు. అయితే త్రివిక్రమ్ ఆ సినిమాకి ఎంత టైం తీసుకుంటాడు అనే క్లారిటీ ఇంకా లేదు. పాన్ ఇండియా స్థాయిలో ఆ సినిమా ఉండబోతుందనే క్లారిటీ కూడా లేదు. కానీ అల్లు అర్జున్ కి పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ అయితే ఉంది.

ఇక అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ నాలుగు సంవత్సరాలు వరకు తన ప్లాన్ ఏంటి అని ఆల్రెడీ రీవీల్ చేశారు. ఇకపోతే ప్రస్తుతం స్పిరిట్ సినిమా చేస్తున్న సందీప్ ఆ తర్వాత అనిమల్ కి సీక్వెల్ చేయనున్నాడు. అయితే త్రివిక్రమ్ తో సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎంతకాలం వెయిట్ చేస్తాడు, లేదంటే ఇంకో సినిమా ఓకే చేస్తాడా అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు