SIIMA : నామినేషన్ లో అగ్ర స్థానం

దక్షణ భారతదేశంలో అతి పెద్ద చలన చిత్ర అవార్డుల కార్యక్రమం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA). ప్రతి ఏడాది సౌత్ సినీ ఇండస్ట్రీలో వచ్చిన సినిమాలలో ది బెస్ట్ వాటిని గుర్తించి పలు విభాగాల్లో అవార్డులు ఇస్తారు. SIIMA 2022 కు సంబంధించి సెప్టెంబర్ 10, 11 తేదీల్లో బెంగళూరులో జరగనుంది. దాని కోసం ఇప్పటికే నిర్వాహకులు పనులు ప్రారంభించారు. అందులో భాగంగా SIIMA చైర్‌పర్సన్ బృందా ప్రసాద్ నాలుగు సౌత్ సినీ ఇండస్ట్రీలలో 2021లో విడుదలైన సినిమాలకు SIIMA నామినేషన్‌లను ప్రకటించారు.

టాలీవుడ్ లో అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ది రైజ్ 12 నామినేషన్లతో మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ ఉంది. అఖండకు 10 నామినేషన్లు వచ్చాయి. అలాగే బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమా 8 నామినేషన్లతో మూడో స్థానంలో ఉంది. ఈ ఉప్పెన సినిమాతో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైన విషయం తెలిసిందే. తర్వాతి స్థానంలో 8 నిమినేషన్లతో జాతి రత్నాలు ఉంది.

అలాగే తమిళంలో ధనుష్-మారి సెల్వరాజ్ కాంబోలో వచ్చిన కర్ణన్ 10 నామినేషన్లతో అగ్రస్థానంలో ఉంది. శివకార్తికేయన్, నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన డాక్టర్ 9 నామినేషన్లతో రెండవ స్థానంలో ఉంది. 7 నామినేషన్లతో మాస్టర్, తలైవి సినిమాలు మూడవ స్థానంలో ఉన్నాయి.

- Advertisement -

కన్నడలో తరుణ్ సుధీర్ హీరోగా దర్శన్ దర్శకత్వంలో వచ్చిన ‘రాబర్ట్’ 10 నామినేషన్లతో తొలి స్థానంో ఉంది. రాజ్ బి శెట్టి, రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో రాజ్ బి శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన గరుడ గమన వృషభ వాహనం 8 నామినేషన్లతో రెండో స్థానంలో నిలిచింది. పునీత్ రాజ్ కుమార్ హీరోగా సంతోష్ ఆనంద్‌రమ్ దర్శకత్వం వహించిన యువరత్న 7 నామినేషన్లతో మూడవ స్థానంలో ఉంది.

మలయాళంలో టోవినో థామస్ కథానాయకుడిగా బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిన్నల్ మురళి’ 10 నామినేషన్లతో ముందంజ ఉంది. దుల్కర్ సల్మాన్ హీరోగా శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వంలో కురుప్ 8 నామినేషన్లతో రెండో స్థానంలో నిలిచింది. తర్వాత స్థానంలో ఫహద్ ఫాసిల్ నటించిన మాలిక్, జోజి సినిమాలు 6 నామినేషన్లతో ఉన్నాయి. దీనిలో మాలిక్ సినిమాకు మహేష్ నారాయణ్ దర్శకత్వం వహించగా. జోజికి దిలీష్ పోతన్ దర్శకత్వం వహించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు