Pushpa 2 Song Update : పుష్ప అంటే ప్లవర్ కాదు… ఇప్పుడు అగ్గి రవ్వ

Pushpa 2 Song: తెలుగు ప్రేక్షకులే కాకుండా దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప 2. పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప మొదటి భాగం సక్సెస్ కావడంతో… అందరూ రెండవ పార్ట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా చేయగా… రష్మిక హీరోయిన్గా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సుకుమార్ చాలా గ్రాండ్గా ఎక్కించారు.

Pushpa2SecondSingle – ‘The Couple Song’ announcement video out now

అల్లు అర్జున్ లో ఉన్న మాస్ యాంగిల్ ను బయటకు తీసి మంచి విజయాన్ని అందుకున్నారు సుకుమార్. ఈ సినిమాతో అల్లు అర్జున్ అలాగే రష్మిక మందాన కెరియర్ కూడా ఒక రేంజ్ కి వెళ్ళింది. ఈ సినిమా మైత్రి మూవీ బ్యానర్స్ పై వస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇలాంటి నేపథ్యంలోనే వరుసగా ఈ సినిమా నుంచి అప్డేట్లు వస్తున్నాయి.

ఇటీవల పుష్ప 2 ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన చిత్ర బృందం… సెకండ్ సింగల్ పై అప్డేట్ ఇచ్చింది. ఇవాళ సుసేకి అగ్గి రవ్వ మాదిరే ఉంటాడే నా సామి అంటూ సాగే కపుల్ సాంగ్ ను అనౌన్స్ చేసింది చిత్ర బృందం. ఇందులో రష్మిక మందాన కనిపించడం మనం చూసాం. ఇక ఈ పూర్తి పాటను మే 29వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపింది. కాగా పుష్ప 2 (Pushpa 2 )సినిమా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు