Pushpa 2 Records : కొత్త రికార్డు సృష్టించిన పుష్ప 2 క‌పుల్ సాంగ్‌

Pushpa 2 Records : ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. అందులో కొన్ని సినిమాలు మాత్రమే సక్సెస్ అవుతాయి. మరికొన్ని సినిమాలు ఫెయిల్ అవుతాయి. కొన్ని సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకుంటాయి. ఇక మరికొన్ని సినిమాలు మాత్రం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి భారీ సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటాయి. అలాంటి సినిమాల్లో “పుష్ప” సినిమా ఒకటి. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన నటించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. “పుష్ప” సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఈ సినిమా పాన్ ఇండియా మొత్తంగా మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సీక్వెల్ “పుష్ప2” సినిమా ఈ ఏడాది థియేటర్లోకి రాబోతుంది. “పుష్ప2” సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా సరే ఓకే నిమిషంలో వైరల్ అయిపోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ అయి ప్రేక్షకుల్లో మంచి అంచనాలను అందుకున్నాయి. తాజాగా విడుదలైన “పుష్ప2” కపుల్ సాంగ్ ఓ కొత్త ట్రెండ్ ను సృష్టిస్తుంది.

Pushpa The Rule Second Song: Allu Arjun, Rashmika Mandanna Vibe To The Couple Song Sooseki | Times Now

- Advertisement -

అందులో “సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి” అనే కపుల్ సాంగ్ ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటలో బన్నీ, రష్మిక హుక్ స్టెప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఎక్కడా చూసిన సోషల్ మీడియాలో ఇదే పాట ట్రెండ్ అవుతుంది. ఈ పాట మీద కపుల్స్ రీల్స్ చేస్తూ పాపులర్ అవుతున్నారు. ఇక “పుష్ప”, “పుష్ప టు” సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. అయితే తాజాగా ఈ పాట ఓ కొత్త రికార్డును క్రియేట్ చేసింది.

యూట్యూబ్ లో ఇప్పటికే ఈ పాట 100 మిలియన్ వ్యూస్ దాటాయి. 1.67 మిలియన్ లైక్స్ కూడా వచ్చాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది చిత్ర బృందం.ఇక ప్రస్తుతం ఎక్కడ చూసినా అందరి నోట ఇదే పాట వినిపిస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ రెండు పాటలు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను అందుకున్నాయి. ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు