PushpaTheRule : భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ కి రెడీ అయిన సుక్కూ..

Pushpa The Rule : ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా మూవీ లవర్స్ కల్కి ఊపులో ఉన్నారు. అన్ని భాషల్లోనూ ఆ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని రన్ అవుతుంది. ఇక ఆ సినిమా తరవాత తెలుగులో రాబోయే పాన్ ఇండియా సినిమాల్లో భారీ హైప్ ఉన్న సినిమా “పుష్ప ది రూల్”. నిజానికి ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ సినిమాని ఇంకాస్త పగడ్బందీగా తీద్దామని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఆగష్టు నుండి తప్పించి ఏకంగా డిసెంబర్ వాయిదా వేశారు. ఇక బన్నీ సుక్కూ కాంబినేషన్ లో మూడేళ్ళ కింద వచ్చిన పుష్ప ఓ రేంజ్ భీభత్సం సృష్టించగా, ఇప్పుడు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 పై పదింతల అంచనాలు పెంచేసింది. ఇప్పుడు రాబోతున్న పుష్ప2 పై ఏకంగా వెయ్యి కోట్ల బొమ్మ అని ట్యాగ్ వేసేసారు నెటిజన్లు. ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి కొత్త షెడ్యూల్ అప్డేట్ వచ్చింది.

PushpaTheRule movie latest shooting update

భారీ యాక్షన్ సీక్వెన్స్ కి రెడీ అయిన సుక్కూ…

ఇక లేటెస్ట్ సమాచారం ప్రకారం పుష్ప ది రూల్ షూటింగ్ కి సంబంధించి భారీ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ శివారులో ఓ ప్రముఖ స్టూడియోలో ప్రారంభం కానుందట. ఇక్కడ రెండు వారాల పాటు ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేయనుండగా, సినిమాలో ఈ యాక్షన్ సీన్ ప్రీ క్లైమాక్స్ లో లేదా, క్లైమాక్స్ లో వచ్చే అవకాశం ఉందట. సినిమాకి హై ఇచ్చే సీన్లలో ఇది కూడా ఒకటని అంటున్నారు. బహుశా ఈ సీన్ లోనే మంగళం శీను, భన్వర్ సింగ్ షెకావత్ ఒకటిగా టీం అయ్యి పుష్ప రాజ్ ఫైట్ చేసే ఛాన్స్ ఉందట. ఇక పుష్ప 2 బడ్జెట్ ఇప్పటికే 300 కోట్లు దాటిపోయిందని సమాచారం. రిలీజ్ అయ్యే టైం కి మరో యాభై కోట్లు అదనంగా అయ్యే ఛాన్స్ ఉందట.

- Advertisement -

వెయ్యి కోట్లే టార్గెట్…

ఇక పుష్ప ది రూల్ (PushpaTheRule) డిసెంబర్ 6 కి రిలీజ్ అయితే సంక్రాంతి వరకూ పెద్ద సినిమాలు ఉండవు. అంటే దాదాపు నెలరోజులకి పైగా లాంగ్ రన్ ఉంటుంది. కాబట్టి మేకర్స్ ఈ టైం లో రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది. క క్రిస్మస్ కి రాబోతున్న మీడియం రేంజ్ సినిమాల వల్ల పెద్దగా ఎఫెక్ట్ ఉండదని మేకర్స్ భావిస్తున్నారు. వెయ్యి కోట్ల వసూళ్లే టార్గెట్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అందుకే లేట్ అయినా పర్వాలేదని మంచి కంటెంట్ ఉన్న సినిమాని దించడానికి రెడీ అవుతున్నారు. ఇకపోతే పుష్ప2 నుండి మూడో సాంగ్ జులై రెండో వారంలో రిలీజ్ చేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు