RashiKhanna : స్టేజ్ మీద హీరోయిన్ పాటకి డీఎస్పీ బిజిఎం..

RashiKhanna : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ‘ఊహలు గుసగుసలాడే’ వంటి క్లాసిక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. తొలి సినిమాతోనే అద్భుతమైన సక్సెస్ ని అందుకున్న రాశి, ఆ తరవాత వరుస సినిమాలతో దూసుకుపోయింది. అయితే రీసెంట్ గా అంతగా అవకాశాలు రాకపోవడంతో ఇతర భాషల్లో బిజీ అయింది. అయితే ఎప్పటికప్పుడు తెలుగు ఆడియన్స్ కి మాత్రం టచ్ లోనే ఉంటూ వస్తుంది. తెలుగులో ఛాన్స్ వస్తే మాత్రం ఈ అమ్మడు వదులుకోదు అది కంఫర్మ్ గా చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగులో రాశికి వచ్చినంత గుర్తింపు ఏ ఇండస్ట్రీలో కూడా రాలేదు. అందుకే అప్పుడప్పుడూ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లో, తెలుగు సినిమా ఈవెంట్స్ లో సందడి చేస్తూ ఉంటుంది.

RaashiKhanna Singing song at IIFA Awards Curtain Riser

రాశి పాటకు డిఎస్పీ బీజీఎమ్..

ఇదిలా ఉండగా లేటెస్ట్ గా సౌత్ లో 2024 ఐఫా అవార్డ్స్ ఈవెంట్ నిన్న జరిగింది. సౌత్ ఇండియాకి చెందిన అనేక మంది సెలెబ్రిటీలు ఈ ఈవెంట్ లో హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో రాశిఖన్నా కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక ఈ వేడుకలో రానా, తేజ సజ్జా హోస్ట్ లు గా నిలవగా, స్టేజ్ వద్ద రాశి ఖన్నాని పలకరించి ఇండస్ట్రీపై పలు ఆసక్తికర విషయాలను, తన కెరీర్ గురించి చెప్పుకొచ్చింది రాశిఖన్నా. ఈ క్రమంలో తన కెరీర్ కి బెస్ట్ గుర్తింపు తెచ్చిన తొలిచిత్రం ఊహలు గుసగుసలాడే ని గుర్తుచేసుకుంటూ.. ఆ సినిమాలో “ఏం సందేహం లేదు” అనే పాట పాడింది. అయితే ఈ పాటకు పక్కనే ఉన్న దేవిశ్రీ ప్రసాద్ బీజీఎమ్ ఇవ్వడం హైలెట్ గా నిలిచింది. ఇక రాశి స్టేజి పై పాడిన ఈ పాటని మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్ ట్విట్టర్ లో షేర్ చేసాడు.

- Advertisement -

వరుస సినిమాలతో బిజీ..

అయితే రాశిఖన్నా (RashiKhanna) ఈ పాట పాడడం కొత్త కాదు… ఏ ఈవెంట్ కి వెళ్లినా, ఏ ప్రమోషన్స్ చేసినా తన తొలిసినిమా గురించి ఈ పాట గురించి గుర్తు చేసుకుంటూ, పాడుతూ ఉంటుంది. గతంలో వేరే సినిమా ఫంక్షన్స్ లో కూడా రాశిఖన్నా ఈ పాట పాడడం జరిగింది. ఇక రాశి ఖన్నా ప్రస్తుతం తెలుగులో ‘తెలుసు కదా’ సినిమాలో నటిస్తుండగా, హిందీలో మరో రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అలాగే తమిళ్ లో రూపొందుతున్న కార్తీ సర్దార్ సీక్వెల్ లో కూడా నటించే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు