Raayan : కెరీర్ బెస్ట్ కొట్టబోతున్న ధనుష్.. ఇంకా కావాలంటే?

Raayan : కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన 50వ సినిమా ‘రాయన్’ థియేటర్లలో అదిరిపోయే కలెక్షన్లు కొల్లగొడుతుంది. జులై 26న థియేటర్లలో తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయిన రాయన్ ఫస్ట్ డే మిశ్రమ స్పందన తెచ్చుకున్నా, ఆ తర్వాత అదిరిపోయే మౌత్ టాక్ తో స్టడీ కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోతుంది. ధనుష్ స్వీయ దర్శకత్వంలో మొదటి సినిమాగా రాయన్ ను తెరకెక్కించగా, ఫస్ట్ సినిమాతోనే దర్శకుడిగానూ మంచి మార్కులు కొట్టేసాడు. ఇక రాయన్ సినిమా మొదటి వీకెండ్ లో ధనుష్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించడమే కాకుండా, తన లాస్ట్ సినిమా కెప్టెన్ మిల్లర్ కలెక్షన్లను కూడా బ్రేక్ చేసింది. పైగా వర్కింగ్ డే లో కూడా స్టడీ కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోయింది.

Raayan movie crossed the 100 crore mark

వారం లో సెంచరీ కొట్టేసిన రాయన్…

ఇక రాయన్ సినిమా తొలి మూడు రోజుల్లోనే 74 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేయగా, వర్కింగ్ డే లో డ్రాప్ అయిన మంచి హోల్డ్ ని కొనసాగిస్తూ అదిరిపోయే వసూళ్లు సాధించింది. తాజాగా రాయన్ తొలి వారం పూర్తి చేసుకోగా, వారం రోజుల్లో వరల్డ్ వైడ్ గా 100.20 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఇక 47.80 కోట్ల షేర్ వసూలు చేసిన రాయన్ రెండో వీకెండ్ లో అదిరిపోయే వసూళ్లు సాధిస్తుంది. ఇంతకు ముందు ధనుష్ నటించిన తిరు, సార్ సినిమాలు వందకోట్లు వసూలు చేయగా, రాయన్ ఠీ ధనుష్ వరుసగా మూడో సారి వంద కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. ఇదిలా ఉండగా తాజాగా రాయన్ సినిమా ధనుష్ కెరీర్ బెస్ట్ రికార్డులు బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతుంది.

- Advertisement -

కెరీర్ బెస్ట్ కొట్టేందుకు ఎంత దూరం అంటే…

ఇక ధనుష్ నటించిన రాయన్ వారం రోజుల్లో సరిగా వంద కోట్లు వసూలు చేయగా, ఇంతకు ముందు నటించిన తిరు సినిమా 105 కోట్లు వసూలు చేయగా, ధనుష్ కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా ‘సార్’ సినిమా నిలిచింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 121 కోట్ల వసూళ్లు సాధించింది. ఇప్పుడు సార్ రికార్డులు బ్రేక్ చేసే దిశగా రాయన్ సినిమా దూసుకుపోతుంది. అంటే సార్ రికార్డ్ ని బ్రేక్ చేయడానికి రాయన్ ఇంకా 20 కోట్లు రాబట్టాలి. ఇక ఈ రెండో వారం లో మంచి హోల్డ్ చూపిస్తే పది రోజుల్లోనే బ్రేక్ చేయొచ్చు. ఇక రాయన్ సినిమాలో ధనుష్ తో పాటు సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి, ప్రకాష్ రాజ్, సెల్వ రాఘవన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించగా, సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ సినిమాని నిర్మించారు. లాంగ్ రన్ లో రాయన్ 150 కోట్ల మార్క్ డేట్ అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు