Raayan : రాయన్ కి జీరో బజ్… కారణాలు ఇవే.

Raayan : తమిళ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తున్న రాయన్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ ఈ శుక్రవారం రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ మూవీ ధనుష్ కెరీర్లో 50వ సినిమాగా రాబోతోంది. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా రిలీజ్ కానుంది. కానీ ఈ సినిమాపై తెలుగులో బజ్ మాత్రం నిల్ అన్నట్టుగా ఉంది. మరి ధనుష్ లాంటి స్టార్ హీరో మూవీకి జీరో బజ్ రావడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

రాయన్ కు నో బజ్

ధనుష్ నటుడు, గాయకుడు, గీత రచయిత, దర్శకుడు, నిర్మాతగా తమిళ సినిమా ఇండస్ట్రీలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ మల్టీ టాలెంటెడ్ హీరో రాయన్ సినిమాతో బిజీగా ఉన్నారు. ధనుష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా ఇందులో హీరోగా కూడా నటించాడు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎ.ఆర్‌.రెహమాన్ రాయన్‌కు సంగీతం అందించారు. రాయన్ లో ధనుష్‌తో పాటు సందీప్ కిషన్, ఎస్‌జె సూర్య, ప్రకాష్ రాజ్, అపర్ణ బాలమురళి, వరలక్ష్మి శరత్‌కుమార్, కాళిదాస్ జయరామ్, సెల్వరాఘవన్ నటిస్తున్నారు. నార్త్ చెన్నై నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ధనుష్ స్క్రిప్ట్ అందించారు. ఈ మూవీ జూలై 26 న థియేటర్లలోకి రానుంది.

కాగా రీసెంట్ గా హైదరాబాద్ లో ఈ సినిమా కోసం ధనుష్ ప్రత్యేకంగా ఈవెంట్ ను నిర్వహించి, తన కామెంట్స్ తో పవన్ లాంటి స్టార్ హీరోల దృష్టిని తన వైపుకు అయితే తిప్పుకున్నాడు. కానీ అది రాయన్ సినిమాపై హైప్ పెంచడంలో ఏమాత్రం ఉపయోగపడలేదు. తమిళ మార్కెట్లో ధనుష్ సినిమాకు బాగానే హైప్ ఉంది. కానీ తెలుగులో ఈ సినిమా మరో రెండ్రోజుల్లో రిలీజ్ కాబోతున్న సందడి ఏమాత్రం కన్పించడం లేదు. పరిస్థితిని చూస్తుంటే అసలు సినిమా రిలీజ్ అవుతుందా? లేదా ? అన్న విషయం కూడా ప్రేక్షకులకు తెలియదేమో అన్పిస్తోంది. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న ధనుష్ సినిమా విషయంలో ఇలా జరగడం నిజంగా ఆశ్చర్యకరమే.

- Advertisement -

Dhanush's Raayan audio launch to take place on this date?

ఇవే కారణాలు

ఇటీవల కాలంలో సినిమాలకు తక్కువ ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేయడం అనేది ట్రెండ్ గా మారింది. నిజానికి ప్రభాస్ ఈ ట్రెండ్ ను మొదలు పెట్టారు. భారీ అంచనాల కారణంగా ప్రభాస్ సినిమా స్టోరీ ఎలా ఉన్నప్పటికీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అవుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన స్ట్రాటజినీ మార్చి సలార్ ను రిలీజ్ చేశారు. అసలు ప్రభాస్ బయట ఎక్కడా కన్పించకుండానే మంచి హైప్ నెలకొనడంతో పెద్దగా ప్రమోషన్స్ జోలికి వెళ్లాల్సిన అవసరం రాలేదు. ఇక వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన కల్కి విషయంలో కూడా ఇలాగే ప్రమోషన్స్ విషయంలో మమ అన్పించారు. ఇక సలార్ నుంచే ప్రభాస్ క్రియేట్ చేసిన ఈ ట్రెండ్ చాలామంది హీరోలు ఫాలో అవుతూ వస్తున్నారు. కానీ ఒక్కరు కూడా ఆ స్ట్రాటజీతో సక్సెస్ కాలేకపోయారు. ఇక తాజాగా రాయన్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఇప్పటిదాకా సైలెంట్ గా ఉండి, రిలీజ్ కి ముందు ఈవెంట్ ప్లాన్ చేశారు. అయితే స్టార్-స్టడెడ్ తారాగణం ఉన్నప్పటికీ, తెలుగు వెర్షన్‌కు అడ్వాన్స్ బుకింగ్‌లు చాలా తక్కువగా ఉన్నాయి.  కనీసం ట్రైలర్ కూడా ప్రేక్షకులకు సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయలేకపోయింది. మరి రాయన్ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు