Raayan: అరుదైన గౌరవం అందుకున్న రాయన్..!

Raayan.. తాజాగా సిస్టర్ అండ్ బ్రదర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం రాయన్. ధనుష్ హీరోగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ధనుష్ 50వ చిత్రం గా వచ్చిన ఈ చిత్రానికి ఆయనే స్వయంగా దర్శకత్వం వహించాడు కూడా.. ఈ చిత్రంలో దుషార విజయన్ ,సందీప్ కిషన్, కాళిదాసు జయరామ్ , సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి, ఎస్. జె. సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. నార్త్ చెన్నై కథాంశం తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పైగా ధనుష్ 50వ చిత్రం ఆయన కెరియర్ లో ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు. ఇక ధనుష్ 50వ సినిమాకి సన్ పిక్చర్స్ వారు నిర్మించారు ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.

Raayan: Raayan received a rare honor..!
Raayan: Raayan received a rare honor..!

అరుదైన గౌరవాన్ని అందుకున్న రాయన్..

అయితే ఈ సినిమా తాజాగా అరుదైన గౌరవాన్ని అందుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఆస్కార్ లైబ్రరీలో రాయన్ స్క్రీన్ ప్లే చోటు దక్కించుకోవడం గమనార్హం.. ఈ సినిమా తర్వాత ది వ్యాక్సిన్ వార్ , పార్కింగ్ వంటి సినిమాలకు కూడా ఇదే గౌరవం లభించడం గమనార్హం. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఆస్కార్ అకాడమీలో రాయన్ సినిమా చోటు దక్కించుకోవడం నిజంగా ఆశ్చర్యకరం అని చెప్పవచ్చు.

రాయన్ సినిమా కథ..

ధనుష్ రాయన్ సినిమా కథ విషయానికి వస్తే, చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ధనుష్.. గ్రామంలో తమకు భద్రత లేదని గ్రహించి , తన చెల్లి, ఇద్దరు తమ్ముళ్ళతో చెన్నైకి వస్తాడు. అక్కడ సెల్వ రాఘవన్ ను కలుస్తాడు అతడు సహాయంతో తన తమ్ముళ్లను చెల్లెల్ని చూసుకుంటూ ఎలాంటి సమస్య వచ్చినా వారిని కాపాడుతూ వారికి కంచుకోటగా నిలుస్తాడు. అయితే ఊహించని విధంగా అతడి మొదటి సోదరుడు సందీప్ కిషన్ ఆ ప్రాంతానికి పెద్దన్న అయిన శరవణన్ కొడుకును చంపేస్తాడు.. ఆ తర్వాత నుంచి తమ్ముడిని, తన కుటుంబాన్ని ధనుష్ ఎలా కాపాడాడు? ఏం జరిగింది? అనేది సినిమా కథ.

- Advertisement -

రాయన్ కలెక్షన్స్..

ఈ సినిమా గత నెల 26వ తేదీన థియేటర్లలో విడుదలై ఏడు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.102 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది . ధనుష్ 50వ చిత్రం రాయన్ ఏడు రోజుల్లోనే రూ .100కోట్ల సాధించి,బాక్సాఫీస్ హిట్ కొట్టడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంతోషం ఇప్పుడు రెట్టింపు అయ్యింది. ఆస్కార్ లైబ్రరీలో చోటు దక్కించుకోవడం అటు ధనుష్ కి ఇటు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పవచ్చు. మొత్తానికి వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అటు తమిళ్ ఇటు తెలుగు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్న ధనుష్, త్వరలోనే మరో కొత్త ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఏది ఏమైనా ధనుష్ 50వ చిత్రం ఆయన కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయిందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు