Racharikam : దేవత అవతారంలో ఆర్జీవీ హీరోయిన్… ఇదెక్కడి మాస్ చేంజోవర్ పాప?

Racharikam : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరిచయం చేసిన హీరోయిన్ అప్సర రాణి గతంలో బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలతో అలరించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ రూటు మార్చి దేవత రూపంలో దర్శనం ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది.

అప్సర రాణి రాచరికం

రామ్ గోపాల్ వర్మ చిత్రాలతో అలరించిన ప్రముఖ కథానాయిక అప్సర రాణి రాచరికం సినిమాతో తెలుగు చిత్రసీమలోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది. తన కెరీర్‌లో తొలిసారిగా పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలో కనిపించనున్న అప్సర రాణికి ఇదో పెద్ద ఛాలెంజ్ అని చెప్పవచ్చు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి అప్సర రాణి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేసారు. ఈ పోస్టర్‌లో అప్సర కాళీమాత అవతారంలో కన్పిస్తోంది. ఈ సస్పెన్స్ డ్రామాలో ఆమె పాత్ర చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. ఈ చిత్రంలో విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ హీరోలుగా నటిస్తున్నారు. సురేష్ లంకాలపల్లి దర్శకత్వం వహించిన రాచరికం మూవీని నిర్మాత ఈశ్వర్ తన కొత్త బ్యానర్ అయిన చిల్ బ్రోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్నారు.

ఇక ఇప్పటికే రాచరికం షూటింగ్ పూర్తి కాగా, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు సారధి స్టూడియోస్‌లో శరవేగంగా జరుగుతున్నాయి. చివరి దశకు చేరుకున్న ఈ సినిమాపై అప్సర రాణి లుక్ రివీల్ చేయడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. రాచరికంలో హైపర్ ఆది, మహేష్, శ్రీకాంత్ అయ్యంగార్, మెంబూబ్ బాషా, పాచి థాకర్, రూపేష్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి వెంగి సంగీతం అందించగా, ఆర్య సాయి కృష్ణ సినిమాటోగ్రాఫర్. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.

- Advertisement -

GDnx1DubAAAygHh.jpeg

వరుణ్ సందేశ్ కి చాలా ముఖ్యం

చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న వరుణ్ సందేశ్ మళ్లీ హీరోగా కెరీర్ ను స్టార్ట్ చేశాడు. అయినప్పటికీ ఆయన సినిమాలు స్మాష్ హిట్స్ కాకపోయినా, అనేక ఆఫర్లు వస్తున్నాయి. అయితే సినిమాల ఫలితం సంగతి ఎలా ఉన్నా ప్రతి చిత్రంతో వరుణ్ నటుడిగా మరింత మెరుగవుతున్నాడు అని చెప్పవచ్చు. ఇప్పటిదాకా వరుణ్ కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్ అంటే ఒక్క హ్యాపీ డేస్ మాత్రమే. ఇక ఇప్పుడు మరోసారి రాచరికం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. కాగా వరుణ్ సందేశ్‌కి ఈ చిత్రం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అతను బ్యాడ్ ప్యాచ్ చిత్రాల తర్వాత పరిశ్రమలో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తున్నాడు. థ్రిల్లింగ్ కాన్సెప్ట్, డిఫరెంట్ కంటెంట్, సగటు ప్రేక్షకుడిని కట్టిపడేసే సన్నివేశాలతో ఈ సినిమా రూపొందుతోంది. కాబట్టి ఎలాగైనా ఈ మూవీతో హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు వరుణ్. అలాగే అప్సర రాణికి కూడా ఈ మూవీ కీలకమనే చెప్పాలి. ఆమె కెరీర్లో హీరోయిన్ గా చెప్పుకోవడానికి సరైన హిట్ ఒక్కటి కూడా లేదు. పూర్తిగా బోల్డ్ రోల్స్ కు మాత్రమే పరిమితం అవుతుందేమో అనుకున్న ఈ బ్యూటీ తరువాత ఐటం సాంగ్స్ చేసింది. ఇక ఇప్పుడు ఏకంగా లేడి ఓరియంటెడ్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు