Rachcha Ravi : యాంకర్ గీతా భగత్ పై రచ్చ రవి డబుల్ మీనింగ్ డైలాగ్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందిగా

జనాలను ఆకట్టుకోవడానికి కొంతమంది కమెడియన్లు చేసే కామెంట్స్ కొన్నిసార్లు హద్దు దాటి చిరాకు తెప్పిస్తాయి. తాజాగా రచ్చ రవికి ఇదే పరిస్థితి ఎదురైంది. ఏకంగా స్టేజ్ మీదే యాంకర్ గీతా భగత్ పై రచ్చ రవి డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేశాడు. వెంటనే ఆమె వాటిని తిప్పి కొట్టి, బుర్ర తిరిగి పోయే రేంజ్ లో రచ్చ రవికి ఇచ్చి పడేసింది.

కొంతకాలం క్రితం శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన “బ్రోచేవారెవరురా” అనే మూవీ ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో వీళ్ళ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. మరోసారి ఇదే కాంబో “ఓం భీమ్ బుష్” అంటూ ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అవుతోంది. “హుషారు” ఫేమ్ డైరెక్టర్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో ఈ క్రేజీ ఫన్ రైడ్ తెరకెక్కింది. ఈ కామెడీ ఎంటర్టైనర్ లో శ్రీ విష్ణు హీరోగా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రీతి ముకుందన్, ఆయేషా ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రచ్చ రవి, ఆదిత్య మీనన్, శ్రీకాంత్ అయ్యర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్నీ ఎమ్ ఆర్ సంగీతం అందిస్తుండగా, “ఓం భీమ్ బుష్” మూవీ మార్చ్ 22న థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు. అందులో భాగంగానే తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్ లోనే కమెడియన్ రచ్చ రవి చేసిన ఓవర్ యాక్షన్ కు యాంకర్ గీతా భగత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

“ఓం భీమ్ బుష్” టీజర్ లాంచ్ ఈవెంట్లో రచ్చ రవి డబుల్ మీనింగ్ డైలాగులతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అది కాస్తా ఓవర్ కావడంతో యాంకర్ అసహనం వ్యక్తం చేసింది. ముందుగా రచ్చ రవి మాట్లాడుతూ “గీతా ఓం భీమ్ బుష్” అనగానే, “నువ్వు ఎంత మంత్రం వేసినా నేను ఇక్కడే ఉంటాను” అని ఆన్సర్ ఇచ్చింది. అయితే రచ్చ రవి అక్కడితో ఆగకుండా “నీది మాయమైంది” అని కాస్త గ్యాప్ ఇచ్చి “మనసు… నా దగ్గరకు వచ్చేసింది” అంటూ డబుల్ మీనింగ్ వచ్చేలా పంచ్ వేశాడు. దీంతో గీతా “నువ్వు స్పేస్ నుంచి వచ్చావు కాబట్టి స్పేస్ ఇవ్వకు మొత్తం కంప్లీట్ చెయ్” అని అన్నది. కానీ రచ్చ రవి ఆమె మాటలు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో యాంకర్ గీతా “ఓం భీమ్ బుష్… నీది కూడా మాయమైంది.. బుర్ర” అంటూ అతని తరహాలోనే ఇచ్చి పడేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో రచ్చ రవి లాంటి వాళ్లకు జబర్దస్త్ స్టేజ్ పైన స్కిట్లలో ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు వేసి వేసి అలవాటైపోయింది. కానీ స్టేజ్ పైనే అతనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి గీత మంచి పని చేసింది. అప్పుడప్పుడు వీళ్లకు ఇలాంటి మనుషులు ఎదురైతేనే అదుపులో ఉంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు