Radhika: యూట్యూబ్ ఛానల్స్ పై ఫైర్.. కఠినంగా శిక్షించాలి..?

Radhika.. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాధిక ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సరసన నటించి ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. అంతే కాదు తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే తన మొదటి భర్త శరత్ కుమార్ కూతురైన వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లిలో ఆడి పాడిన రాధిక, ప్రస్తుతం తన కెరీర్ పైన దృష్టి సారించింది. అందులో భాగంగానే సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందిస్తూ.. కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ పై మండిపడింది రాధిక.

Radhika: Fire on YouTube channels.. should be severely punished..?
Radhika: Fire on YouTube channels.. should be severely punished..?

యూట్యూబ్ ఛానల్స్ పై మండిపడుతున్న రాధిక..

అసలు విషయంలోకెళితే సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల పై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర మంత్రి, సినీ నటుడు ఉదయనిధిని సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ కోరింది. సెలబ్రిటీలు కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని తమ పరువు బజారుకీడ్చుతున్న యూట్యూబ్ ఛానల్ యజమానులపై పరువు నష్టం దావా వేయాలని కూడా కోరింది రాధిక.

మంచు విష్ణు పై ప్రశంసలు..

అంతే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు పై ప్రశంసలు కురిపించింది. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను బజారుకీడుస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై మంచు విష్ణు చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా 18 యూట్యూబ్ ఛానల్ లను ఆయన క్లోజ్ చేయించారు.ఆయన్ని చూసి నేను గర్విస్తున్నాను అంటూ తెలిపింది.

- Advertisement -

నడిగర్ సంఘానికి అభ్యర్థన..

ఈ క్రమంలోనే నడిగర్ సంఘం మేల్కోవాలి. జర్నలిస్టుగా చెప్పుకునే కొంతమంది వ్యక్తులు చాలా మంది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలతో ఆడుకుంటున్నారని, అదే పనిగా వారిపై అసత్య కథనాలను సృష్టించి ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వారి కోసం నూతన చట్టాలు తీసుకురావాలంటూ కూడా ఆమె కోరింది. ఈ విషయంలో సినీ పరిశ్రమ కూడా ఏకం కావాలని సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ అందరికీ పిలుపునిచ్చింది . ప్రస్తుతం రాధిక చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి

రాధికా సినీ జీవితం..

రాధికా విషయానికి వస్తే.. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ని మొదలుకొని బాలకృష్ణ వరకు అందరి సినిమాలలో నటించి మెప్పించింది రాధిక.. ఈ మధ్యకాలంలో యంగ్ హీరోలకు తల్లిగా నటిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. ఒకవైపు కుటుంబ బాధ్యతలు మరొకవైపు సినీ జీవితం అంటూ కొనసాగుతున్న ఈమె ఇటీవల రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టింది. బిజెపి తరఫున పోటీ చేసి ఘోరంగా ఓడిపోయింది. అందుకే మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె ఇప్పుడు ఇండస్ట్రీలో సెలబ్రిటీలపై జరుగుతున్న అన్యాయాలను బయట పెడుతూ సెలబ్రిటీలకు అండగా నిలుస్తోంది రాధిక. మరి రాధిక కోరిక మేరకు తమిళ్ నడిగర్ సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు