Raghava Lawrence: త్వరలో మరో వారసుడు.. ఆశీస్సులు కావాలంటూ విన్నపం..!

Raghava Lawrence.. సినీ ఇండస్ట్రీలో వారసులకు కొదవలేదనే చెప్పాలి. ఇప్పటికే స్టార్ సెలబ్రిటీలుగా ఒక హోదా సంపాదించుకున్న హీరోలు, హీరోయిన్లు తమ తదనంతరం.. తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు.. పరిచయం చేయడమే కాదు ప్రజల ప్రేక్షకుల ఆశీస్సులు తమ వారసులకు కావాలి అని సోషల్ మీడియా ద్వారా విన్నపిస్తున్నారు కూడా.. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో మహేష్ బాబు వారసుడు ఘట్టమనేని గౌతమ్ కృష్ణ, పవన్ కళ్యాణ్ వారసుడు కొణిదెల అకీరా నందన్, బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఇలా వీరంతా కూడా ఇండస్ట్రీలోకి రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ వారసుల కోసం అభిమానులు ఎంతగానో ఆరాటపడుతుండగా మరొకవైపు తన సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన రాఘవ లారెన్స్ కూడా తన వారసులను అందరికీ పరిచయం చేయబోతున్నట్లు సమాచారం.

సేవాగుణంలో తండ్రి బాటలో కొడుకు..

Raghava Lawrence: Soon another heir.. Request for blessings..!
Raghava Lawrence: Soon another heir.. Request for blessings..!

ప్రముఖ డైరెక్టర్ గా, డాన్స్ మాస్టర్ గా, స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడిపేస్తూనే.. మరొకవైపు సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు.. ఇప్పటికే ఎంతోమంది అనాధ పిల్లలకు అభాగ్యులకు పలు సేవా కార్యక్రమాలు, ఛారిటబుల్ ట్రస్ట్ ల ద్వారా తనకు చేతనంత సహాయం చేస్తూనే ఉన్నాడు.. ఈ క్రమంలోనే తన కొడుకు విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏ తండ్రి అయినా సరే వారసత్వంగా కొడుకులకు ఆస్తులు ఇస్తారు కానీ రాఘవ లారెన్స్ మాత్రం తన సేవా గుణాన్ని వారసత్వంగా ఇచ్చినట్లు తెలుస్తోంది .ఈ క్రమంలోనే రాఘవ లారెన్స్ కొడుకు ఒకవైపు చదువుకుంటూనే మరొకవైపు పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ వచ్చిన డబ్బులను పేదలకు ఉపయోగిస్తున్నారు.. ఈ విషయంపైనే ఒక వీడియోని షేర్ చేస్తూ నా కుమారుడికి మీ ఆశీస్సులు కావాలి అంటూ కోరుతున్నారు రాఘవ లారెన్స్.

నాటిన విత్తనం ఉదారమైన అబ్బాయిగా ఎదిగింది..

Raghava Lawrence: Soon another heir.. Request for blessings..!
Raghava Lawrence: Soon another heir.. Request for blessings..!

వీడియో విషయానికి వస్తే.. రాఘవ లారెన్స్ మాట్లాడుతూ.. హాయ్ ఫ్రెండ్స్ నేను నాటిన విత్తనం ఇప్పుడు ఉదారమైన అబ్బాయిగా ఎదిగింది.. అతడే శ్యామ్.. ప్రస్తుతం కాలేజీలో మూడవ సంవత్సరం చదువుతూ పార్ట్ టైం జాబ్ కూడా పనిచేస్తున్నాడు. 10 సంవత్సరాల నుండి నేను హెప్సిబా అనే అమ్మాయి చదువు కోసం మద్దతు ఇస్తున్నాను.. రాయపురానికి చెందిన ఈమె చిన్నప్పటి నుండి అమ్మమ్మ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు హెప్సిబ కోసం శ్యామ్ ఈ ఏడాది స్కూల్ ఫీజు చెల్లిస్తున్నాడు నాకు చాలా గర్వంగా ఉంది. శ్యామ్ యొక్క సేవా ప్రయాణానికి మీ అందరి ఆశీస్సులు కావాలి.. శ్యామ్ నాలాగే సేవాగుణంలో మునిగిపోవాలి ఎంతోమందికి చేయూతగా ఉండాలి.. దీనికోసం మీరు ఈయనను ఆశీర్వదించాలి అంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు రాఘవ లారెన్స్.. ప్రస్తుతం రాఘవ లారెన్స్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాదు అభిమానులు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంత చిన్న వయసులోనే ఇంతటి ఉదారం తండ్రిలాగే గొప్ప సేవ గుణం కలిగిన వ్యక్తి శ్యామ్ అంటూ ఇతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం శ్యామ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా త్వరలోనే వారసుడు ఇండస్ట్రీలోకి రాబోతున్నారు అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు