Raghava Lawrence: కథ సిద్ధమైంది షూటింగ్ అప్పటినుంచే

Raghava Lawrence: రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు మెగాస్టార్ చిరంజీవికి ఎన్నో అద్భుతమైన సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. కేవలం కొరియోగ్రాఫర్ గానే కాకుండా నటుడుగా కూడా ఎన్నో సినిమాలు చేశాడు రాఘవ లారెన్స్ . అలానే రాఘవ లారెన్స్ దర్శకుడుగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. తన కెరీర్లో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించాడు లారెన్స్. లారెన్స్ తీసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ నిలిచాయి.

నాగార్జునతో మాస్, డాన్ వంటి సినిమాలు చేసి దర్శకుడుగా కూడా మంచి పేరును సాధించాడు. అయితే ప్రభాస్ హీరోగా రెబల్ అనే సినిమాను కూడా చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇకపోతే లారెన్స్ హర్రర్ సినిమాలను ఎలా తీస్తాడో ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు. కాంచన అనే సినిమా మంచి హిట్ గా నిలిచింది అక్కడితో దానిని వదలకుండా అదేపనిగా అదే పేరుతో కాంచన 2 కాంచన 3 సినిమాలు చేసుకుంటూ వచ్చాడు కానీ కాంచన సినిమా చూపించిన ఇంపాక్ట్ రెండు సినిమాలు చూపించలేకపోయాయి. ఇప్పుడు కొత్తగా కాంచన ఫోర్ సినిమాతో ఫ్రాక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు లారెన్స్.

Raghava Lawrence

- Advertisement -

ఇకపోతే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ కంప్లీట్ గా పూర్తి చేసినట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నెలలో మొదలుకానున్నట్లు తెలుస్తుంది. ఒకవైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూ మరోవైపు నటుడుగా కూడా తన సత్తాను చూపిస్తున్నాడు రాఘవ లారెన్స్. కేవలం తెలుగు ప్రేక్షకులలో మాత్రమే కాకుండా అనిల్ ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ లారెన్స్ కి ఉంది. ఇకపోతే రియల్ లైఫ్ లో చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాడు రాఘవ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు