RL25 : రాఘవ లారెన్స్ 25వ సినిమా అనౌన్స్ మెంట్.. ఆ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ కి రీమేక్?

RL25 : టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒక చిన్న డాన్స్ మాస్టర్ గా కెరీర్ ప్రారంభించి, ఇండియాలోనే బెస్ట్ కొరియోగ్రాఫర్ లలో ఒకడిగా ఎదిగాడు. చిరంజీవి, రజినీకాంత్ లాంటి స్టార్ హీరోల సపోర్ట్ తో డాన్స్ మాస్టర్ గా ఎదిగిన లారెన్స్, నాగార్జున (Nagarjuna) అండతో మాస్ సినిమాతో డైరెక్టర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత హీరోగానూ తనని తానూ నిరూపించుకున్నాడు లారెన్స్. అయితే పాతికేళ్ల కిందటే స్పీడ్ డాన్సర్ తో హీరోగా మారిన రాఘవ లారెన్స్ (Raghava Lawrence), స్టైల్ సినిమాతో హీరోగా బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ తర్వాత ముని, కాంచన లాంటి హర్రర్ సిరీస్ లతో సూపర్ హిట్స్ కొట్టాడు. ఇదిలా ఉండగా కొంతకాలంగా వరుస ప్లాప్ లు అందుకుంటున్న రాఘవ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు.

Raghava Lawrence's 25th movie as a remake of Kill movie

రాఘవ లారెన్స్ 25వ సినిమా అనౌన్స్ మెంట్…

ఇక రాఘవ లారెన్స్ లాస్ట్ ఇయర్ చంద్రముఖి, ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ తో ప్లాప్స్ అందుకోగా, కాస్త గ్యాప్ తీసుకున్న రాఘవ లారెన్స్ తన కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసాడు.రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న కొత్త ప్రాజెక్ట్‌ ను రమేష్ వర్మ (Ramesh Varma) దర్శకత్వంలో తెరకెక్కుతుండగా, ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థలైన ఎ స్టూడియోస్ ఎల్‌ఎల్‌పి, నీలాద్రి ప్రొడక్షన్స్ మరియు హావిష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా లారెన్స్ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న 25వ (RL25) చిత్రం కావడం విశేషం.

- Advertisement -

ఆ హిందీ బ్లాక్ బస్టర్ రీమేక్ గా లారెన్స్ సినిమా?

ఇక లారెన్స్ హీరోగా భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌ కి సంబంధించినా భారీ అంచనాలుండగా, ఈ సినిమా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “కిల్” (Kill) సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతోందని సమాచారం అందింది. లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో వచ్చిన ఆ సినిమా హిందీలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయింది. ఆల్మోస్ట్ సినిమా సగభాగం మొత్తం ఒక ట్రైన్ లోనే ఉండడం విశేషం. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా హిందీలో మంచి విజయం సాధించగా, ఇప్పుడు ఈ సినిమా రీమేక్ లో రాఘవ లారెన్స్ నటిస్తున్నట్టు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఇంకా టైటిల్ నిశ్చయించని ఈ సినిమాను నవంబర్ 2024 లో ప్రారంభించి 2025 సమ్మర్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు