Raghava lawrence : “రుద్రుడు” వర్కౌట్ అవుతుందా ?

రాఘవ లారెన్స్ హీరోగా, క‌దిరేశ‌న్ దర్శకత్వంలో వస్తోన్నా చిత్రం రుద్రన్. ఈ సినిమాని తెలుగులో “రుద్రుడు” అనే పేరుతో ఈ నెల 14 న రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్ నిన్న రిలీజ్ చేసారు. ఫ్యామిలీ రివెంజ్ స్టోరీని తలపించేలా అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. రాఘవ లారెన్స్ అనగానే మనకి గుర్తొచ్చేది హర్రర్ కామెడీ సినిమాలు. అయితే ఈ సారి లారెన్స్ కాస్త రూట్ మార్చి ఒక మాస్ సినిమాతో ఈ నెల 14న థియేటర్ లో సందడి చేయనున్నాడు.

గతేడాది ఆయన “లక్ష్మి ” ( కాంచన సినిమా రీమేక్ )అనే సినిమాతో బాలీవుడ్ లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ కోవిడ్ కారణంగా సినిమాని ఓటిటిలో రిలీజ్ చేయాల్సి వచ్చింది. అప్పటికే సౌత్ లో అన్ని భాషల్లో రీమేక్ చేసి విజయం సాధించిన కాంచన సిరీస్ హిందీ లో మాత్రం వర్క్ అవుట్ అవ్వలేదు. దాంతో దర్శకుడిగా కొంత గ్యాప్ తీసుకున్న లారెన్స్.. రుద్రన్ మూవీతో మళ్ళీ థియేటర్స్ కి వస్తున్నాడు. ప్రస్తుతం దసర, రావణాసుర మినహా సినిమాలు ఏవి లేకపోవడంతో లారెన్స్ ఈ సినిమా ని రిలీజ్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమా లారెన్స్ సినిమాలకి పూర్తి భిన్నంగా కమర్షియల్ సినిమా తరహాలో ఉండబోతుంది. లారెన్స్ సినిమా అంటే తెలుగు మినిమమ్ గ్యారంటీ ఉంటుంది. మరి ఆ సెంటిమెంట్ ఈ సారి కూడా కలిసొస్తుందో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు