Raghu Babu: 25 యేళ్ళ సంపాదన.. వారి వల్లే నాశనం…?

Raghu Babu.. సినీ పరిశ్రమ ఒక రంగుల ప్రపంచం. ఎప్పుడు ఎవరి జీవితం ఎలా మారుతుందో చెప్పడం అసాధ్యం. అందుకే చాలామంది సెలబ్రిటీలు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది సంపాదించిన డబ్బు జల్సాలకు పోయి ఖర్చు చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది సంపాదించిన డబ్బును నిర్మాణం అంటూ సినిమాలపై పెడుతూ నష్టపోతూ ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక నటుడు తన 25 ఏళ్ల సంపాదన మొత్తం ఒక సినిమా వల్లే పోయింది అంటూ హాట్ బాంబ్ పేల్చారు. మరి ఆయన ఎవరు? అసలు ఏం జరిగింది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

Raghu Babu: 25 years of earnings.. destroyed by them...?
Raghu Babu: 25 years of earnings.. destroyed by them…?

తండ్రి వారసత్వాన్ని అందుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన రఘుబాబు..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న గిరిబాబు.. విలన్ గా, నటుడిగా, కమెడియన్ గా సినీ పరిశ్రమలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పటికీ అవకాశాలు వస్తే నటిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా పనిచేశారు. అయితే నటుడిగా చేసినన్ని సినిమాలు ఆయన దర్శకనిర్మాతగా చేయలేదనే చెప్పాలి. ఇదిలా ఉండగా ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు రఘుబాబు. తండ్రి వారసత్వాన్ని పుచ్చుకున్న రఘుబాబు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా పేరు సొంతం చేసుకున్నారు. ఈయన కూడా తన తండ్రిలాగే కమెడియన్ , విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మంచి పేరు సొంతం చేసుకున్నారు.

25 యేళ్ళ సంపాదన ఒక్క సినిమాతో పోయింది..

ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రఘుబాబు ఎన్నో విషయాలను పంచుకున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం. రఘుబాబు మాట్లాడుతూ.. మా సొంత బ్యానర్ పై మా నాన్న సినిమాలు నిర్మించారు. 1990లో తమ్ముడు హీరోగా ఇంద్రజిత్తు సినిమాని నిర్మించాం.. అయితే అప్పట్లో ఆ సినిమా కోసం ఏకంగా రూ.50 లక్షలు ఖర్చు చేశాము బాగానే ఆడింది .కానీ ఆ డబ్బులు మా వరకు రాలేదు. సినిమా రిలీజ్ చేయడానికి నాన్న ఎన్నో కష్టాలు పడ్డారు.. రిలీజ్ అయిన తర్వాత మంచి టాక్ వచ్చినప్పటికీ కూడా మా చేతికి రూపాయి కూడా అందలేదు. నష్టాల్లో కురుకుపోయినట్టు చూపించారు.

- Advertisement -

నష్టాలను భర్తీ చేయడానికి ఆస్తులు అమ్ముకున్నాం..

నిజానికి సినిమా బయటపడిపోయిన తర్వాత ఎవరు ఎవర్ని పట్టించుకోరు. అయితే నాన్న అలా కాదు.మాకు రూపాయి రావాల్సి ఉంది అంటూ ఎవరు గేటు ముందు ఉండకూడదనేది ఆయన పద్ధతి. ఇంద్రజిత్తు సినిమా కారణంగా వచ్చిన నష్టాలను పూడ్చడం కోసం 25 సంవత్సరాలుగా కూడబెట్టిన స్థిరాస్తులను కూడా అమ్మేశాము. అలా కొంతమంది మాకు డబ్బులు రాలేదని, సినిమా నష్టపోయిందని నష్టాలు చూపించారు. దాంతో మేము ఉన్నదంతా కోల్పోయాము. కాలం కలిసి వస్తే మళ్లీ సంపాదించుకుందామని, లేకపోతే ఊరికి వెళ్ళిపోదామని నాన్న చెప్పారు. అలా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని నేడు ఈ స్థాయిలో నిలుచున్నాము అంటూ రఘు బాబు తమ కష్టాలను చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ఇంద్రజిత్తు సినిమా కారణంగా కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు, నష్టాలను చూపించి తమ ఆస్తులను అమ్మేలా చేశారని బాధపడ్డారు రఘుబాబు. ఏది ఏమైనా రఘుబాబు చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు