Rahat Fateh Ali : దుబాయ్ లో పాకిస్థానీ సింగర్ అరెస్ట్… వివాదం ఏంటంటే?

Rahat Fateh Ali : ఓ ఈవెంట్ కోసం దుబాయ్ వెళ్ళిన ప్రముఖ పాకిస్థానీ గాయకుడు రాహత్ ఫతే అలీఖాన్‌ ను దుబాయ్ ఎయిర్‌ పోర్టులో పోలీసులు అరెస్టు చేశారనే వార్త ఆయన అభిమానులను షాక్ కు గురి చేసింది. ఆయన మాజీ మేనేజర్ ఫిర్యాదు మేరకు ఈ అరెస్ట్ చేశారని అంటున్నారు. తాజాగా ఈ వివాదంపై పాకిస్థాన్ సింగర్ స్పందించారు. మరి ఇంతకీ వివాదం ఏంటంటే?

దుబాయ్ లో పాకిస్థానీ సింగర్ అరెస్ట్

అనేక భారతీయ చిత్రాలలో పాటలకు తన గాత్రాన్ని అందించిన ప్రముఖ పాకిస్థానీ గాయకుడు రాహత్ ఫతే అలీ ఖాన్ కు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పాకిస్థాన్‌లోనే కాకుండా విదేశాల్లో కూడా ఆయన అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంది. రాహత్ తన షోల కోసం తరచుగా దుబాయ్ వెళ్తుంటాడు. ఎప్పటిలాగే తన తాజా ఈవెంట్ కోసం ఆయన దుబాయ్‌లో ఉన్నారు. అయితే అతన్ని ఇమ్మిగ్రేషన్ సెంటర్‌లో నిర్బంధించి, విచారణ కోసం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఆయన మాజీ మేనేజర్ చేసిన కంప్లయింట్ మేరకు ఈ అరెస్ట్ జరిగిందని అన్నారు. అయితే వీరిద్దరి మధ్య జరిగిన గొడవ ఏంటి? అసలు ఏ కేసులో అతన్ని అరెస్ట్ చేశారు? అనే విషయాలు మాత్రం తెలియరాలేదు అంటూ జోరుగా వార్తలు వచ్చాయి.

Rahat Fateh Ali Khan arrested at Dubai Airport? - Pakistan Observer

- Advertisement -

అరెస్ట్ వార్తలపై రహత్ వివరణ

దుబాయ్‌లో తనను అరెస్టు చేసినట్లు వచ్చిన వార్తలను రాహత్ ఖండించారు. అలాంటి వార్తలను పట్టించుకోవద్దని తన ఫాలోవర్లను కోరారు. సోషల్ మీడియా వేదికగా రాహత్ అసలేం జరిగిందో వెల్లడించారు. “నేను నా పాటలను రికార్డ్ చేయడానికి దుబాయ్ వచ్చాను. నా పాటల పనులన్నీ అద్భుతంగా జరుగుతున్నాయి. ఇక్కడ అంతా బాగానే ఉంది. నా అభిమానులలు ఎలాంటి రూమర్స్‌ను నమ్మొద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను అనేక పాటల కోసం పని చేస్తున్నాను. ప్రపంచాన్ని ఊపేసే సూపర్‌హిట్ పాటతో త్వరలో తిరిగి వస్తాను. నా శత్రువులు వ్యాప్తి చేస్తున్న ఇలాంటి పుకార్లను పట్టించుకుని మీ సమయాన్ని వృథా చేయకండి. నా మీద మీ నమ్మకాన్ని ఉంచండి. నా ప్రేక్షకులు, అభిమానులే నా శక్తి. నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను” అంటూ అరెస్ట్ వార్తలపై క్లారిటీ ఇచ్చారు.

పనివాడిని చెప్పుతో కొట్టి..

ఇటీవల రాహత్ తన ఇంట్లో పని చేసే వ్యక్తిని చెప్పుతో కొట్టాడనే వివాదంలో చిక్కుకున్నాడు. రాహత్ తన ఇంట్లో జరిగిన గొడవలో తన ఇంటి సిబ్బందిపై శారీరకంగా దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే రాహత్ ఆ ఆరోపణలను తిరస్కరిస్తూ ఒక ప్రకటనను విడుదల చేశాడు. ఓ వ్యక్తిని చెప్పుతో కొట్టిన వార్తలన్నీ ఫేక్ అని, తన ప్రతిష్టను దెబ్బతీసే దురుద్దేశపూరిత ప్రచారంలో ఇదంతా భాగమని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగులందరినీ గౌరవంగా చూడాలన్న నిబద్ధతకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అంతలోనే దుబాయ్ లఓ అరెస్ట్ అనే వార్తలు పుట్టుకొచ్చాయి. మరి ఈ సింగర్ విషయంలో అసలేం జరుగుతుందో ?!

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు